బాలయ్య సినిమా కొనేసిన తెలంగాణ ప్రిన్స్ | Young hero acquired Nizam rights of Balayya's GSP

Tollywood hero acquired nizam rights of balayya s gsp

Nithiin link with Balayya 100th Movie, Nizam rights of Balayya's 100th Movie, After Sai Korrapati Now Nithiin, Nithiin Balayya Movie, Balayya Prestigious movie for Balayya, Nithin Balayya 100th movie, Telangana Price, Telangana Super Star, Balayya 100th movie Rights

Young hero Nithin acquired Nizam rights of Balayya's 100th Movie Gautamiputra Satakarni.

బాలయ్య సినిమా కుర్రహీరో వేలు పెడితే...

Posted: 10/01/2016 04:47 PM IST
Tollywood hero acquired nizam rights of balayya s gsp

టాలీవుడ్ నట సింహం బాలకృష్ణకు వారాహి అధినేత సాయి కొర్రపాటికి గత కొంత కాలంగా ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. ఆ చొరవతోనే ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సీడెడ్ హక్కులను రికార్డు ధరకు కొనేశాడు. ఇక ఇప్పుడు నైజాంలో ఆ పనిని ఓ కుర్రహీరో దక్కించుకున్నాడు.  

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూటర్ రంగంలో ఉన్నాడు.  నితిన్ హీరో అయ్యాక కూడా కొన్నాళ్ల పాటు ఆ బిజినెస్ కొనసాగించి ఆ తర్వాత తప్పుకున్నాడు. ఇక అఖిల్ చిత్రంతో నిర్మాతగా మారి, అది డిజాస్టర్ కావటంతో ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఓవైపు సినిమాలు చూసుకుంటూనే, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిపోయాడు. ఈ క్రమంలో బాలయ్య శాతకర్ణి హక్కులను పొందాడని తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. బాలయ్య గారి 100 వ చిత్రం శాతకర్ణి నైజాం హక్కులు మేమే సొంతం చేసుకున్నాం. క్రిష్ మరియు రాజీవ్ గారికి కృతజ్నతలు అంటూ ఓ ట్వీట్ ఉంచాడు. ఇక భారీ బడ్జెట్ భారీగా తెరకెక్కుతున్న శాతకర్ణికి క్రేజీ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావటంతో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బాలయ్య అభిమానులపై నమ్మకం, పైగా హిస్టారికల్ ప్రాజెక్టు కావటంతోనే వారంతా రిస్క్ చేసేందుకు కూడా వెనకాడటం లేదనేది వారి అభిప్రాయం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithiin  Balayya  100th movie  GSP  Nizam Rights  

Other Articles