గాంధీ జయంతికి వంగవీటితో వర్మ చేసే రచ్చ | RGV Vangaveeti Movie Trailer on Oct 2nd

Rgv vangaveeti movie trailer on oct 2nd

RGV ready to release Vangaveeti Movie Trailer, RGV special treat on Oct 2nd, RGV special treat on Gandhi Jayanthi, RGV ready to release Vangaveeti , RGV Vangaveeti release date, Vangaveeti Trailer, Vangaveeti Cast, RGV vangaveeti

RGV ready to release Vangaveeti Movie Trailer on Oct 2nd.

రేపు వర్మ చేసే రచ్చ ఎలా ఉంటుందో?

Posted: 10/01/2016 01:38 PM IST
Rgv vangaveeti movie trailer on oct 2nd

టైం గానీ టైంలోనే వర్మ చేసే వ్యవహారాలు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. ఎవరేమనుకున్న ఫర్వాలేదు అనుకుంటూ వివాదాస్పద అంశాలన్నీ కెలుకుతుంటాడు. అయితే అవి శృతి మించినా సరే వర్మను తిరిగి ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు. బహుశా అవి చాలా ఓపెన్ గా ఉంటాయని కాబోలు. ఈ మధ్య మిడ్ నైట్ కాస్త మసాలా అంశాలు దట్టిస్తూ చేస్తున్న ట్వీట్లతో జనాలకు తిక్క రేగి లైట్ తీస్కుంటున్నారు.

కానీ ఇప్పుడు మాత్రం ఆర్జీవీ ప్రస్తుతం చేయబోయే ఓ పని కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అది అలాంటి టాపిక్ కాబట్టి. తన అప్ కమింగ్ తెలుగు చిత్రం వంగవీటి సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 2 న విడుదల చేయబోతున్నానంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందుకు సంబంధించి పోస్టర్ ను కూడా వదిలాడు. అహింసను పాటించాల్సిన గాంధీ జయంతి రోజు హింసకు పరాకాష్ట అయిన వంగవీటి పోస్టర్ ను వదలటం వర్మలాంటి పైత్యం ఉన్న వ్యక్తికి మాములు విషయమే అనుకుంటున్నారా? దానిని మేము లైట్ తీసుకునే వాళ్లమే. కానీ, గాంధీ జయంతి శుభాకాంక్షలతో అన్న పదం అక్కడ మెయిన్ హైలెట్ గా మారింది.

ఎప్పుడు మొదలైంది.. ఎప్పుడు షూటింగ్ పూర్తియ్యిందో.. అసలు ఎక్కడ చిత్రీకరించాడో తెలియని వంగవీటి సినిమా ద్వారా శాంతి సందేశం మాత్రం ఇస్తానంటున్నాడు. హ్యాపీడేస్ ఫేం హీరో వంశీ, దేవినేని మురళి పాత్రలో నటిస్తుండగా, నటుడు సందీప్ లీడ్ రోల్ వంగవీటి రంగా పాత్రలో కనిపించనున్నాడు. హింసకు, అహింసకు ముడిపెడుతూ వర్మ చేస్తున్న ప్రయత్నానికి  ఫ్రీ పబ్లిసిటీ  పిచ్చపిచ్చగా దొరుకుతోంది. ఓవైపు వంగ-దేవినేని వార్, బెజవాడ రౌడీయిజం అంశాలు చూపించబోతుండటం, మరోవైపు కాపు రిజర్వేషన్లపై రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో కాపు కాసే శక్తి అంటూ ట్యాగ్ లైన్ పెట్టి వర్మ చేస్తున్న ఈ సినిమాను థియేటర్ల దాకా రానిస్తారా అన్నది వేచి చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Vangaveeti Movie  Trailer  0ctober 2nd  

Other Articles