బాహుబలి ప్రెస్ మీట్ కంక్లూజన్| Baahubali team press meet details about conclusion

Baahubali team press meet details about conclusion

Rajamouli speech in Baahubali team pressmeet, Baahubali 3, Rajamouli Baahubali series, Rajamouli shocking comments on Tamanna, Rajamouli Baahubali pressmeet, Prabhas about his upcoming projects, baahubali 2 logo, Baahubali 3 project

Baahubali team press meet details about conclusion.

బాహుబలి ప్రెస్ మీట్లో బోలెడు విషయాలు

Posted: 10/01/2016 10:19 AM IST
Baahubali team press meet details about conclusion

బాహుబలి సినిమా చిరస్థాయిగా నిలుస్తుందని రాజమౌళి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బాహుబలి చిత్ర యూనిట్ సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను రాజమౌళి వెల్లడించాడు. హాలీవుడ్ సినిమాల్లా తన సినిమా సిరీస్ లుగా రూపొందాలని ఆయన చెప్పారు. తాను 'బాహుబలి'తో ఆగిపోనని, ఎన్నో సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు. 'బాహుబలి కన్ క్లూజన్' ఎంత వసూళ్లు చేస్తుందన్నది తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

‘బాహుబలి-2: ది కన్‌క్లూజన్’ లోగోను రిలీజ్ చేసిన అనంతరం వారంతా ఒక్కోక్కరుగా మాట్లాడారు. వాస్తవం ఒకటి, ఊహ ఒకటి ఉంటుందని అన్నారు. వాస్తవం అయితే 'బాహుబలి బిగినింగ్' ఎంత వసూళ్లు చేసిందో, అంతకంటే 30 శాతం ఎక్కువ వసూళ్లు రావాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలవాలని భావిస్తున్నామని, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ లో ఒకటిగా నిలవాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

Baahubali The Conclusion Official Logo

అక్టోబర్‌ నెల అంటే బాహుబలి టీమ్‌కి అంత ప్రత్యేకత ఏమిటి? నెల ప్రారంభం నుంచి చివరి వరకూ సినిమా టీమ్‌ జనాలకు ఏం బహుమతిగా ఇవ్వనుంది. అక్టోబర్‌ 5, 22, 23 తేదిలకున్న ప్రత్యేకత ఏంటి? జరగబోయే అద్భుతం ఏంటి? ప్రభాస్‌ పెళ్లి గురించి కాదనీ, సినిమా కథను రివీల్‌ చెయ్యరనీ, అవార్డుల గురించి కాదనీ ముందే చెప్పారు. మరేంటీ సస్పెన్స్? వీటికి సమాధానం కోసం ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సస్సెన్సకు రాజమౌళి చెక్‌ పెట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ‘బాహుబలి-2’ టీమ్‌ ఎన్నో విషయాలను తెలియజేసింది. ‘

బాహుబలి-3?
రాజమౌళి మాట్లాడుతూ ‘‘బాహుబలి’ కథ చాలా పెద్దది. దానిని రెండు మూడు గంటల్లో చెప్పలేం. అందుకే రెండు పార్టులుగా తియ్యాలని ముందుగానే అనుకున్నాం. ‘బాహుబలి’ అనేది మహా వృక్షం అయితే మేం తీసేది అందులో ఓ కొమ్మ మాత్రమే. దీనికి బిగినింగ్‌, ఎండింగ్‌ అనేది లేదు. నేనున్నా లేకపోయినా ‘బాహుబలి’ కొనసాగుతూనే ఉండాలి. ఈ కథను ఇప్పుడే ప్రేక్షకుల ముందు ఉంచడం అంత కరెక్ట్‌ కాదని నా అభిప్రాయం. విజువల్‌ వండర్‌ని తెరపైన చూపించాలన్న కోరికతోనే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయట పెట్టడం లేదు. బాహుబలి-3 కూడా ఉండొచ్చు.

బాహుబలి-2 ఎంతదాకా?
ఇక బాహుబలి 2 కి సంబంధించి మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తయింది. దాదాపు రెండున్నర నెలలు శ్రమించి, కష్టమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశాం. ఎడిటింగ్ పూర్తి చేసి, గ్రాఫిక్స్‌కీ ఇచ్చేశాం. ఇంకా 2 పాటలు, ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్, కొన్ని సీన్లే బాకీ. వాటికి గ్రాఫిక్స్ అవసరం లేదు’’ అని రాజమౌళి చెప్పారు. అతి కష్టమైన క్లైమాక్స్‌ పోరాట సన్నివేశాల చిత్రీకరణ, గ్రాఫిక్స్‌ తదితర కార్యక్రమాలు ఆరు నెలల ముందే పూర్తయ్యాయి. రెండో పార్ట్‌లో తమన్నాకు మంచి పాత్ర ఉంది. కానీ సాంగ్‌ లేదు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే, ఈ 2వ పార్ట్‌కి తనపై అంత ఒత్తిడి లేదన్నారు ’’ అని చెప్పారు.

ప్రభాస్ ఏమన్నాడు...
ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘మధ్యలో నాలుగు నెలలు ఖాళీ దొరికినప్పటికీ విశాంత్రి తీసుకుందామనే మరో సినిమా అంగీకరించలేదు. మహా సముద్రం మధ్య చిన్న నదిని వదలడం భావ్యం కాదనిపించింది. సుజిత్ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. దానితోపాటు మరో రెండు చిత్రాలు పైప్‌లైనలో ఉన్నాయి. ఒకటి రాధాకృష్ణ డైరక్షన్ లో, మరోకటి పెద్దనాన్న కృష్ణంరాజు బ్యానర్ గోపీకృష్ణా సంస్థలో అని తెలిపాడు. ఇక రానా మాట్లాడుతూ... ప్రపంచంలో గుర్తుండిపోయే సినిమాగా బాహుబలి నిలుస్తుందని తెలిపాడు.

అక్టోబర్ ఫెస్ట్...
టీవీ సిరీస్, కామిక్ బుక్స్, వర్చ్యువల్ రియాలిటీ, మర్చండైజింగ్ (వివిధ రకాల ‘బాహుబలి’ వాణిజ్య ఉత్పత్తుల విక్రయం)- లాంటివన్నీ అనేక ఇతర కొమ్మలు’’ అన్నారు. ‘బాహుబలి’ కామిక్ బుక్స్, వర్చ్యువల్ రియాలిటీ (వీఆర్) ఎక్స్‌పీరియన్స్ గురించి రాజమౌళి వివరించారు.

వర్చ్యువల్ రియాలిటీ అనేది ప్రపంచంలో అభివృద్ధి అవుతోన్న టెక్నాలజీ. మనం సినిమా చూస్తున్నప్పుడు మూడో వ్యక్తిగా తెరపై జరిగే దృశ్యాలను చూస్తాం. వర్చ్యువల్ రియాలిటీ అంటే... ఆ సినిమాలోని దృశ్యంలో మనమూ ఉన్న ఓ క్యారెక్టర్‌లా భాగమై, అక్కడ జరుగుతున్న దృశ్యాలను 360 డిగ్రీలలో ప్రేక్షకులు అనుభూతి చెందడం అన్నమాట. మాహిష్మతి రాజ్యమనే ప్రపంచం లోకి వెళ్లి, అందులో ఓ మనిషిలా కథను, దృశ్యాలను ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. మేకింగ్ వీడియోలను ఈ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాం.

బాహుబలి ప్రెస్ మీట్ రీజన్ ఉంది... 

దానికి 25 కోట్ల బడ్జెట్ కేటాయించాం. 200 నుంచి 300 థియేటర్లలో ప్రత్యేకంగా వీడియో బూత్‌లు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. సినిమా రిలీజ్‌కు ఓ నెల ముందే వర్చ్యువల్ రియాలిటీ వీడియోలను విడుదల చేస్తాం. ప్రపంచం మొత్తంలోనే ఇలా చేయడం ఇదే తొలిసారి’’ అని చెప్పారు. ‘‘సినిమా లానే కామిక్ బుక్స్, వీఆర్ అన్నీ భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘వీఆర్ గ్రాఫిక్స్ వర్క్ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నమే మా వీఆర్ టెస్ట్ షాట్ చూశాం. అమెరికాలో కొద్ది నెలల క్రితం నేను చూసిన ఇతర చిత్రాల వాటి కన్నా మంచి క్వాలిటీతో మనది వచ్చింది’’ అని చెప్పారు.

ఇక ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. దానికి ఒక్కరోజు ముందే, అంటే 22న ‘బాహుబలి-2’ సినిమా ఫస్ట్ లుక్, ‘బాహుబలి’ కామిక్ బుక్ సిరీస్‌లో మొదటిది విడుదల చేస్తున్నాం. ఇక, పుట్టినరోజు నాడు వర్చ్యువల్ రియాలిటీలో సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాం’’ అని రాజమౌళి వివరించారు. అలాగే, అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే ‘బాహుబలి’ 2డీ యానిమేషన్ కార్టూన్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు.

నిర్మాతలు...
బాహుబలి ద బిగినింగ్‌ను 32 దేశాల్లో విడుదల చేశాం. జపాన్, కొరియాల్లో ఇంకా విడుదల కావాల్సి ఉంది’’ అని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని వివరించాడు. ‘‘వచ్చే జనవరిలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం’’,  ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Prabhas  Rana  Baahubali Pressmeet  

Other Articles