పాక్ నటీనటులకు మద్ధతుగా సల్మాన్ ట్వీట్ | Salman Khan backs Pakistani actors

Salman khan backs pakistani actors

Salman Khan backs Pak actors, Pakistani actors not terrorists, Salman Pak Actors

Salman Khan backs Pakistani actors says they are artists not terrorists

పాక్ దాడిపై సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 09/30/2016 04:06 PM IST
Salman khan backs pakistani actors

వివాదాలను మెడలో వేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి అదేస్థాయి కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ నటీనటులంతా ఇండియాకు తిరిగి వచ్చేయండంటూ వ్యాఖ్యలు చేశాడు.

ముంబ‌ైలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సల్మాన్ ప్రసంగిస్తూ... పాక్ న‌టుల‌కు మ‌ద్దతు తెలిపాడు. యూరీ ఘ‌ట‌న‌లో మనవాళ్లను చంపింది ఉగ్రవాదులే.. కానీ న‌టీన‌టులు కాదు కదా అని సల్మాన్ తెలిపాడు. పాక్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదులు కాదని, అందుకే వారిని ఇక్కడ అనుమతించాలని పేర్కొన్నాడు. స‌రైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో భార‌త్ కు రావాల‌ంటూ వారికి పిలుపునిచ్చాడు. కళకు హద్దులు ఉండవన్న సల్లూ భాయ్, ఇరు దేశాల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం నెలకొనాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏకంగా పాకిస్థాన్ నటీనటులు, టెక్నీషియన్లపై నిషేధం విధించినట్లు శుక్రవారం ప్రకటిస్తుంది. స‌ద‌రు అసోసియేష‌న్ భార‌త ప్రొడ్యూస‌ర్లు పాక్ ఆర్టిస్టుల‌తో కలిసి పని చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. వీటి ఈ నేప‌థ్యంలోనే స‌ల్మాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Pakistan Actors  Back to India  

Other Articles