బాహుబలి-2 అనుమానాలు రేపు తీరిపోతాయి | baahubali team pressmeet on Conclusion

Baahubali team pressmeet on conclusion

Baahubali team Pressmeet, Rajamouli pressmeet on conclusion, Baahubali The Conclusion Pressmeet, Prabhas in Baahubali The Conclusion PM, Baahubali team pressmeet, Rajamouli in Baahubali The Conclusion Pressmeet

Baahubali team pressmeet on Conclusion along with all caste.

బాహుబలి ప్రెస్ మీట్ రీజన్ ఉంది...

Posted: 09/29/2016 05:33 PM IST
Baahubali team pressmeet on conclusion

బాహుబలి ది బిగినింగ్ తో తెలుగు సినిమా మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో హాట్ కేక్ గా మార్చడమే కాదు... సౌత్ సినిమాల సత్తాను చూపించాడు రాజమౌళి. 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రంపై అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా రెండో పార్ట్ కంక్లూజన్ కి కూడా అదే రీతిలో తీస్తున్నాడు. ఇదిలా ఉండగానే సడన్ గా ప్రెస్ మీట్ పెడుతున్నట్లు బాహుబలి టీం ప్రకటించింది.

మొదటి పార్ట్ టైంలో ఎంతటి రూమర్లు వచ్చాయో, సెకండ్ పార్ట్ సమయంలో కూడా అంతకంటే ఎక్కువ రూమర్లే వచ్చాయి. నటీనటుల నుంచి విడుదల తేదీ దాకా అన్నింట్లోనూ అనుమానాలే ఉన్నాయి. అందుకే వాటన్నింటిని పటాపంచల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ అప్డేట్స్తో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ల రిలీజ్ డేట్లపై ఈ ప్రెస్ మీట్లోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అంటూ ప్రకటించిన యూనిట్ సభ్యులు, అందుకు తగ్గట్టుగా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. తొలి భాగం కన్నా ఎక్కువ బడ్జెట్తో మరింత ఉన్నతమైన గ్రాఫిక్స్తో బాహుబలి పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోగా, శుక్రవారం చిత్రయూనిట్ నిర్వహించే మీడియా సమావేశంలో చిత్ర తారాగణం మొత్తం పాల్గొనే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Team  Pressmeet  The Conclusion  

Other Articles