ధోనీలో చెర్రీ వార్త వెనుక వాస్తవం. | ram charan in Dhoni biopic just rumour

Ram charan not in dhoni biopic

Ram Charan not in Dhoni Biopic, Cherry not as Raina, Sad news for Mega fans, Ram Charan in Dhoni biopic just a rumour, Mega Rumour on Dhoni Bio Pic

Ram Charan in Dhoni biopic just a rumour

రాంచరణ్ గురించి అంతా బుస్ బుస్....

Posted: 09/29/2016 11:43 AM IST
Ram charan not in dhoni biopic

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధ్రువ సినిమా తుది దశకు చేరుకుంది. డిసెంబర్ లో చిత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ముందుగా దసరాకి సందడి చేద్దామని భావించిన చెర్రీ ప్రాజెక్టు డిలే కావటంతో పోస్ట్ పోన్ కే మొగ్గు చూపాడు. అయితే ధోనీ సినిమా రూపంలో చెర్రీ తెరపై సందడి చేస్తాడని భావించిన అభిమానులకు పెద్ద షాకే తగిలింది.

ధోనీ బయోపిక్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ లో సురేష్ రైనా పాత్రను రాంచరణ్ పోషిస్తున్నాడని రెండేళ్ల క్రితం ఓ వార్త వచ్చింది. ఈ మధ్యలో ఎక్కడా దాని గురించి వార్త లేదు. ఇక సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. యూవీ, దీపిక పాత్రలు కూడా ఉన్నాయని తేలటంతో ఇక రైనా పాత్ర కూడా ఉందని అంతా ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే అప్పట్లో వచ్చిన రూమర్ బేస్ చేసకుని ధోనీ లో చెర్రీ అంటూ గుర్తు చేసుకున్నారు. మెగా అభిమానులు కూడా అది నిజమేననుకుని హ్యాపీగా ఫీలయ్యారు.

కానీ, లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ధోనీ బయోపిక్ లో చెర్రీ ఉన్నాడన్న వార్త ఉత్తదేనని తేలింది. చెర్రీ మేనేజర్ ఈ మేరకు ఓ ప్రకటన మీడియాకు రిలీజ్ చేశాడు. గత కొద్దిరోజులుగా రాంచరణ్ ధోనీ సినిమాలో రైనా రోల్ లో నటించారన్న వార్త వస్తోంది. అది అబద్ధం అంటూ అందులో ఉంది. అయితే తెలుగులో భారీ ఓపెనింగ్స్ కోసమే కొందరు మెగా అభిమానులు ఈ రూమర్ లేపారన్న వాదన వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Suresh Raina  Dhoni Bio Pic  Rumour  

Other Articles