లింగుస్వామి చిత్రానికి రెమ్యునరేషన్ లేదా? | Allu Arjun no remuneration for Linguswamy Movie.

Allu arjun acquire nizam rights for linguswamy bilingual movie

Allu Arjun Follows Chiru steps, Bunny Nizam Rights, Allu Arjun Linguswamy Bilingual, Allu Arjun acquired Nizam Rights, Allu Arjun Dual Role in Duvvada, Allu Arjun negative shade in Linguswamy Movie, Allu Arjun follows Chiru Old Idea

Allu Arjun Follows Chiranjeevi Route. Acquired Nizam Rights for Linguswamy Bilingual movie.

చిరు చేసిన పని ఇప్పుడు బన్నీనా?

Posted: 09/26/2016 05:58 PM IST
Allu arjun acquire nizam rights for linguswamy bilingual movie

పేరుకు మెగా వారసుడు అయినప్పటికీ తన సొంత ఇమేజ్ తోనే పైకొచ్చి టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయినప్పటికీ, చిరు వేసిన బాటలోనే తామంతా పయనిస్తున్నాం అంటూ వేడుకల్లో వినయం ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటాడు. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్లతోనే కాదు, ఒకరకంగా ఇప్పుడున్న హీరోల్లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న హీరోగా బన్నీ ముద్రవేసుకున్నాడు. ఇక రెమ్యునరేషన్ విషయంలో ఇంతకాలం పెద్దగా బెట్టు పట్టని బన్నీ ఇప్పుడు చిరు సిలబస్ లోని పాఠాలను వల్లవేస్తున్నాడు.

90వ దశకంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకొనే హీరోగా అప్పట్లో రికార్డు సృష్టించాడు మెగాస్టార్. ఆయనకు ఆ ఇమేజ్ తీసుకువచ్చింది మాత్రం  నైజాం ఏరియా రైట్స్ అన్నది తెలిసిందే. ఓ స్టేజీకి వచ్చాక చిరు సినిమా కి  పారితోషికం తీసుకోకుండా, ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న  నైజాం ఏరియా రైట్స్ ని పారితోషకంగా తీసుకునేవాడు. తద్వారా అప్పుడున్న నలుగురు హీరోల్లోనే కాదు, అప్పటిదాకా ఏ తెలుగు హీరో అందుకోని అత్యధిక పారితోషికం అందుకున్నాడు.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అదే రూట్ లో ఫాలో కాబోతున్నాడంట. ఇటీవలె లింగుస్వామితో బైలింగువల్ అనౌన్స్ చేసేశాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రూపొందుతుండటంతో, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి డిస్కషన్ మొదలైంది. అయితే తనకు రెమ్యునరేషన్ కి బదులుగా నైజాం ఏరియా రైట్స్ ను అడిగినట్టుగా తెలుస్తోంది. అందుకు నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా కూడా ఒప్పుకున్నట్లు, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Linguswamy  Bilingual  No remuneration  Nizam Rights  

Other Articles