నటసామ్రాట్ ఏఎన్నార్ బర్త్ డే స్పెషల్ | Akkineni Nageswara Rao birthday special

Akkineni nageswara rao birthday special

Akkineni Nageswara Rao birthday special, ANR birthday special, Nageswara Rao birthday special, Akkineni Legend, Legend Actor Nageswar Rao, Nageswara Rao 93rd birthday

Akkineni Nageswara Rao birthday special.

ఎవర్ గ్రీన్ ఏఎన్నార్ బర్త్ డే స్పెషల్

Posted: 09/20/2016 09:55 AM IST
Akkineni nageswara rao birthday special

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు నటనకే ఓనమాలు నేర్పిన మహా నటుడు. రంగుల ప్రపంచాన్ని ప్రవృత్తిగా చేసుకుని కడదాకా కళామ తల్లికి అంకితమయ్యాడు. నవరసాలను ఒలకించిన వ్యక్తి.  నేడు(సెప్టెంబర్ 20న) ఆయన 93వ జయంతి. ఈ సందర్భం గా ఆ మహా నటుడుకి తెలుగువిశేష్ నమస్సుమాంజలు. ఈ సందర్భం గా ఒక్కసారి అక్కినేని గురించి అవలోకనం చేసుకుందాం.

కృష్ణా జిల్లా లోని రామాపురం అనే గ్రామం లో వెంకట రత్నం, పున్నమ్మ అనే దంపతులకు 1924, సెప్టెంబర్ 20వ తేదీన ఐదో సంతానం గా జన్మించారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. దాంతో ప్రాధమిక పాటశాల తోనే అక్కినేని చదువుకి ఫుల్ స్టాప్ పడింది. ఊర్లో వేసే నాటకాల్లో ఆడ పాత్రలు వేయడం మొదలు పెట్టారు.

అప్పట్లో ఆడవారు స్టేజీ పైన ఎక్కి నాటకాలు వేసే వారు కాదు. అక్కినేని సన్నగా , అందం గా ఉండడం తో అందరూ ఆడ వేషం కట్టించేవారు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య కనపడి సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాస్ రమ్మని చెప్పారు. దాంతో ఎప్పుడూ ఊరు వదలి వెళ్ళని నాగేశ్వరరావు మద్రాస్ బయలు దేరి వెళ్ళారు. అక్కడ ఆయన ధర్మపత్ని అనే సినిమా లో అవకాశం ఇచ్చారు. అప్పుడు ప్రారంభమైన ఆయన నటనా జీవితం మన(మనం) తో కడదాకా కొనసాగింది.

సీతా రామ జననం లో శ్రీ రాముడి గా అక్కినేని మొదటి సారి వెండి తెరపై హీరోగా కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరుకూ సుమారు 255 సినిమాలకు పైగా సినిమాల్లో అక్కినేని హీరో గా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు.

అక్కినేని అంటే దేవదాసు, దేవదాస్ అంటే అక్కినేని అంటారు ప్రేక్షకులు. ప్రేమలో విఫలమైన భగ్నప్రేమికుడిగా అక్కేనేని నటన ఎన్ని తరాలు మారినా జనం నీరాజనాలు పడుతున్నారు. సావిత్రి, నాగేశ్వర రావు ల నటనని మరువ లేక పోతున్నారు.

రాముడి గా, విష్ణువు గా పలు పౌరాణిక సినిమాల్లో భక్తులకు కనువిందు చేసారు.భూ కైలాస్ వంటి సినిమాలో నారదుడి గా వేసి ప్రశంసలు అందుకున్నారు. ఇంకా శ్రీ కృష్ణార్జున విజయం లో అర్జునుడి గా విశేష ఆదరణ పొందారు.

భక్త తుకారం, పాండురంగమహత్యం వంటి సినిమాలతో భక్తుడిగా తెలుగు ప్రేక్షకులని అలరించారు. స్టెప్పులు వేసిన బుల్లోడు తెలుగు సినిమాల్లో మొదట స్టెప్పులు వేసిన ఘనత అక్కినేనిదే. చెంగావి రంగు చీర అంటూ పాట పాడినా అక్కినేనికే చెల్లింది.

నటుడుగా, నిర్మాత గా అన్నపూర్ణ సంస్థ అధినేతగాఎన్నో విజయాలు సొంతం చేసుకున్నఅక్కినేనిని పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి పలు అవార్డులువరించాయి. చివరి దశలో క్యాన్సర్ తో పోరాడుతూ కూడా సినిమాను వదల్లేదు. అలాంటి మహనటుడు జనవరి 22, 2014 న ఆ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏఎన్నార్ ఎవర్ గ్రీన్ నటుడు. అందరి మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Legend Actor  Akkineni Nageswara Rao  93rd Birthday  

Other Articles