కావేరి వివాదంపై వీడియో పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ | Prakash Raj's request to protesters on Cauvery issue

Prakash raj twitter message in cauvery dispute

Prakash Raj's request on Cauvery issue, Celebs request in Cauvery issue, Kollywood and Sandalwood stars on Cauvery issue, Prakash Raj Cauvery

Actor Prakash Raj's request to protesters on Cauvery issue.

కావేరిపై ప్రకాశ్ రాజ్ చెప్పింది వినాల్సిందే

Posted: 09/13/2016 01:35 PM IST
Prakash raj twitter message in cauvery dispute

కావేరి జల వివాదం హింసాత్మక ఘటనలతో ముదిరిపోతుండటంతో ఇరు రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. నీటి కోసం రక్తాన్ని ఏరులై పారించొద్దంటూ ఇరు రాష్ట్రాల  ప్రజలు సంయమనంతో ఉండాలని అటు శాండల్ వుడ్, ఇటు కోలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాల్లో విజ్నప్తులు చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించిన తీరు అభినందనీయంగా ఉంది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని ఉంచాడు. ఇలా నీటి కోసం మనుషులపై దాడులకు తెగబడడం దారుణమని పేర్కొన్నాడు. నీరు అవసరాలు తీరుస్తుందని, నీటి కోసం ప్రాణాలు తీసుకోవడం అనాగరికమని సూచించాడు. ఇంతా చేసి మనం హింసిస్తున్నది ఎవరిని? సాటి భారతీయుడైన పొరుగు రాష్ట్ర సోదరుడినే కదా? అని నిలదీశాడు.

మనం ముందు మనుషులమన్న సంగతి గుర్తించాలని సూచించాడు. హింస దేనికీ పరిష్కారం కాదని, సోదరులను హింసించడం వల్ల ఆనందం రాదని తెలిపాడు. సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రకాశ్ రాజ్ సూచించాడు. ఈ ఇష్య్యూపై కిచ్చ సుదీప్, దర్శన్, యష్, రమ్య, రమేష్ అరవింద్ లాంటి కన్నడ స్టార్లు, ఇంకోవైపు కోలీవుడ్ నుంచి కుష్బూ, జీవీ ప్రకాశ్ లే కాకుండా, బాలీవుడ్ నుంచి మధుర్ భండార్కర్ కూడా తమదైన శైలిలో శాంతి కోసం పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Cauvery issue  video  

Other Articles