షారూఖ్ ఖాన్ తో కంగనా రనౌత్ | Kangana Ranaut Finally Confirms Movie With Shah Rukh Khan

Kangana ranaut finally confirms movie with shah rukh khan

Kangana Ranaut Shah Rukh Khan, Kangana in Sanjay Leela Bansali movie, Kangana Ranaut movie with Khan

Kangana Ranaut Finally Confirms Movie With Shah Rukh Khan under Sanjay Leela Bansali, but it is at very premature stage.

క్వీన్ కోరిక ఎప్పటికి తీరేనో?

Posted: 08/25/2016 03:44 PM IST
Kangana ranaut finally confirms movie with shah rukh khan

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్, పైగా వరుసగా రెండు సార్లు ఉత్తమ నటిగా, ఒకసారి సహాయనటిగా నేషనల్ అవార్డులు అందుకుంది. కానీ, ఇంత చేసి అగ్రహీరోయిన్ గా చెలామణి అవుతున్నప్పటికీ ఇంతదాకా ఖాన్ త్రయంతో చేసే అదృష్టాన్ని దక్కించుకోలేకపోయింది నటి కంగనా రనౌత్. దీనిపై ఆమెను అడిగితే ఏమంటుందో తెలుసా?

గతంలోనే నాకు చాలా సార్లు ఖాన్ లతో నటించే అవకాశం వచ్చింది. కానీ, ఆయా సమయాల్లో కమిట్ మెంట్ లతో వాటిని దూరం చేసుకున్నాను. నిజానికి గజినిలో హీరోయిన్ పాత్ర కంగనానే చేయాల్సి ఉందట. కానీ, ఆఖరి నిమిషంలో అసిన్ నే ఆ అదృష్టం వరించింది. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు నాకోరిక తీరుతుంది అంటోంది.

అన్నట్లు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి తర్వాత షారూఖ్ తో ఓ సినిమా తీయాలని ఫ్లాన్ చేస్తున్నాడంట. సంజయ్ సార్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. షారూఖ్ తో హీరోయిన్ గా చేయబోతున్నా. కానీ, దానికి చాలా సమయం ఉంది. ఇంతలోగా ఏమైనా జరగొచ్చు. అందుకే ముందే ఆశలు పెట్టుకోవటం లేదు అని చెబుతోందీ రింగుఒత్తుల బ్యూటీ. ప్రస్తుతం కంగనా చేతిలో రంగూన్, సిమ్రాన్, మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, షారూఖ్ రాయిస్, డియర్ జిందగీలతో పాటు ఇంతియాజ్ అలీ సినిమాలతో  బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పూర్తయ్యాకే సంజయ్ లీలా భన్సాలీతో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Shah Rukh Khan  Sanjay Leela Bansali  

Other Articles