నిహారిక తండ్రిగా నాగబాబు | Nagababu plays Niharika's father role in new web series

Nagababu plays niharika s father role in new web series

Nagababu Niharika father role, Niharika's father role in new web series, Niharika's new web series, Naga Babu in Niharika next movie, Niharika Real dad in Real also, Mega Daughter movie with Mega Brother, niharika Pranith web series, Muddapappu Avakayi web series

Mega Brother Nagababu plays Niharika's father role in new web series.

నిహారిక తండ్రి పాత్రలో మెగా బ్రదర్?

Posted: 08/23/2016 05:18 PM IST
Nagababu plays niharika s father role in new web series

కొణిదెల వారసత్వం నుంచి హీరోయిన్ గా ఆరంగ్రేటం చేసి మంచి మార్కులే వేయించుకుంది నిహారిక. టీవీషోల్లో ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ, ఒక మనసు చిత్రంలో మాత్రం చీరకట్టులో పద్దతిగా, సైలెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండకు జోడీగా కొత్త ప్రాజెక్టుతో రెండో సినిమాకు సిద్ధమైపోతుంది. అయితే దానికి చాలా టైం ఉండటంతో ఈ గ్యాప్ లో మాత్రం అస్సలు ఖాళీగా ఉండదట.

అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తో ఆక్టుకున్న నిహారిక అదేనండీ యూట్యూబ్ లో ముద్దు పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ గురించి. దాని తరువాత యూత్ లో ఆమెకి మరింత క్రేజ్ పెరిగింది. అందులో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ కి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను ప్రారంభించేందుకు సిద్ధమైపోతుంది.

'ముద్దపప్పు ఆవకాయ'కి దర్శకత్వం వహించిన ప్రణీత్ రెండో సిరీస్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో పూర్తిగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే డ్రామాగా కొనసాగనుందట. అయితే దీనికి ప్రత్యేకతను సంతరించేందుక ఏకంగా నిహారిక తన తండ్రి నాగబాబుతోనే నటించనుందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్ లో నిహారిక ఎలా అల్లరి చేస్తుందో... రియల్ ఫాదర్ తో రీల్ లో ఎంతటి సందడి చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Konidela Niharika  Web series  Nagababu  father role  

Other Articles