చిరంజీవి 61వ బర్త్ డే సెలబ్రేషన్స్ | chiru 61 birthday celebrations by mega heroes

Ram charan speech at chiru 61 birthday celebrations

Chiru 61 birthday, bunny at chiru birthday celebrations, chiru 61 birthday celebrations, mega heroes at Chiru 61 birthday, Chiru 150 dialogue, mega heroes

chiru 61 birthday celebrations by mega heros and Khaidi no 150 team.

మెగా అభిమానంకు మించింది లేదు

Posted: 08/23/2016 09:53 AM IST
Ram charan speech at chiru 61 birthday celebrations

మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్  డే సెలబ్రేషన్స్ కు అభిమానులతో సమక్షంలో జరుపుకునేందుకు మెగా వారసులంతా తరలివచ్చారు. శిల్పాకళావేదికలో జరిగిన ఈ వేడుకకు తనయుడు రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లతోపాటు, 150వ చిత్ర దర్శకుడు వినాయక్, హీరోయిన్లు రకుల్, రాశిఖన్నాలు కూడా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈ యువ హీరోలంతా మెగాస్టార్ డైలాగ్ లతో సందడి చేశారు.

ఎన్ని జన్మలెత్తినా అభిమానులకు రుణపడే ఉంటామని చిరు తనయుడు రాంచరణ్ తేజ్ అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న చెర్రీ మాట్లాడుతూ, ‘అభిమానులను చూస్తుంటే చిరంజీవి కుటుంబసభ్యులు మేమా? మీరా? అనిపిస్తుంటుంది. మా నాన్నపై మేము చూపించే ప్రేమకు మించి అభిమానులు చూపిస్తుంటారు. అభిమానుల నుంచి మేము నేర్చుకుంటూనే ఉంటాము. సినిమాలు ఒకసారి హిట్ అవొచ్చు, ప్లాప్ అవొచ్చు. కానీ, మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అభిమానులను మేమెప్పుడూ కేర్ లెస్స్ గా చూడలేదు’ అని తెలిపాడు.

ఇక మెగాస్టార్ గురించి ఉపన్యాసాలు దంచే స్టయిలిష్ స్టార్ బన్నీ ఈసారి కేవలం చిన్న స్పీచ్ తో సరిపెట్టేశాడు. ''స్టార్ స్టార్ మెగాస్టార్.. బాస్ ఈజ్ బ్యాక్'' అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టిన బన్నీ.. ''ఏ హీరోకు ఫ్యాన్స్ ఇంత పెద్ద రేంజులో ఫంక్షన్ చేసే స్టారే ఉండరు.  ఆ అదృష్టం మెగాస్టార్ ఒక్కరికే ఉంది. అందుకే ఆయన తరుపును నేను కృతజ్ఞతలను చెబుతున్నాను'' అన్నాడు.  ''బొట్టు పెట్టుకోని హిందువుని.. టోపీ వెయ్యని ముస్లింని.. శిలువ వేసుకోని క్రైస్తవుడిని.. టోటల్ గా ఈ పేటకు మేస్ర్తిని'' అంటూ అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి ''ముఠామేస్ర్తి'' సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పాడు బన్నీ.

ఇది తమకు మెగా పండగతో సమానమని ‘మెగా’ కుటుంబానికి చెందిన యువహీరో సాయిధరమ్ తేజ్ అన్నాడు. ఆయన పుట్టినరోజు కోసం ప్రతి సంవత్సరం వేచిచూస్తుంటామని అన్నారు. కాగా, అభిమానుల కోరిక మేరకు చిరంజీవి నటించిన ఒక చిత్రంలోని డైలాగ్ లను సాయిధరమ్ చెప్పాడు.

''పెదనాన్న పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు.. సినిమాలు మానేస్తున్నారు.. అని చెప్పినప్పుడు బాధ వేసింది. ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడ్చేశా. తరువాత చాలాసార్లు ఆయన్ను డాడీ సినిమలు ఎప్పుడు చేస్తారు?.. వెయిట్ చేస్తున్నాం.. చాలామంది అడుగున్నతారు.. అని అడిగాను. ఆయన చూద్దాం చేద్దాం అన్నారు. ఇక 9 సంవత్సరాల తరువాత ఆయన అందరి మాటా విన్నారు.. బాస్ ఈజ్ బ్యాక్'' అంటూ ఉద్వేగంగా చెప్పాడు వరుణ్ తేజ్. ఇకపోతే చాలామంది మల్ళీ డ్యాన్సులు అలా చేయగలుగుతారా ఫైట్లు చేస్తారా అని అడుగుతున్నారని.. వారందరికీ నా సమాధానం ఒక్కటే.. ''కాశీకి పోయాడు.. కాషాయం మనిషైపోయాడు అనుకున్నారా?.. వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనకున్నారా? అదే రక్తం.. అదే పౌరుషం'' అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగు చెప్పాడు వరుణ్ తేజ్.

చివరగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. ''ఇది ఆయనకు 61వ జన్మదినం కాదు.. సినిమా చూశాక మీరే అంటారు.. ఆయన 21వ జన్మదినం అని. ఎందుకంటే ఆయనే ఆ రేంజులో చేస్తున్నారు. ఫైట్లు కాని - డ్యాన్సులు కాని.. ఇరగదీశారు. చిరంజీవి గారికి ఒక అభిమానిగా.. మనందరం ఏమైతే ఆయన దగ్గర నుండి కోరుకుంటామా అవన్నీ అందులో ఉంటాయి. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టవుతుంది'' అంటూ చెప్పుకొచ్చారు వినాయక్. అంతేకాదు.. ఆయన ఈ సినిమాలోని ఒక డైలాగ్ కూడా చెప్పారు.

విలన్ కు ఇచ్చే ఓ కౌంటర్ గా చిరు చెప్పే డైలాగ్ ఏంటంటే.. ''అరేయ్ పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజమ్ నా ఇంట్లో ఉంటది..'' అని మెగాస్టార్ అంటారట. ఈ డైలాగ్ చెప్పగానే ఒక్కసారిగా ఆడిటోరియం అంతా అదిరిపోయింది. మొత్తానికి మెగా బ్రదర్స్ లేకుండానే ఈవెంట్ ను ఈ యంగ్ హీరోలంతా గ్రాండ్ సక్సెస్ చేశారు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  61 birthday  mega heroes  khaidi team  

Other Articles