చిరంజీవి ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల | Khaidi No 150 First Look Motion Poster released

Khaidi no first look motion poster released

Chiranjeevi 150th Movie Khaidi No 150 First Look, Chiru 150 first look, Chiru 150 official Motion Poster, Chiru 150th first look, Chiru 150 first look official

Chiranjeevi 150th Movie Khaidi No 150 First Look Motion Poster released.

చిరు 150 ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్

Posted: 08/22/2016 04:07 PM IST
Khaidi no first look motion poster released

చిరు గ్రాండ్ ఎంట్రీ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ కు సంబంధించి గత అర్థరాత్రి నుంచి హడావుడి మొదలైంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చిరు ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఒకటే డిస్కషన్ మొదలైంది. చిత్ర నిర్మాత రాంచరణ్ కాసేపటి క్రితం మోషన్ పోస్టర్ ను, రెండు లుక్స్ తో కూడిన పోస్టర్ లను కాసేపటి క్రితం రిలీజ్ చేసేశారు. ఒక పోస్టర్ లో చిరును వెనుక నుంచి చూపించగా, మరో దాంట్లో సీరియస్ గా చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని ఉన్న మెగాస్టార్ ను చూడొచ్చు.

ఇక మోస్టర్ పోస్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కత్తిలా ఉందంతే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సాగే థీమ్ లో ''ఖైదీ నెం వన ఫైవ్ జీరో.. అరె వచ్చేశాడు మనకోసం మన ఎవర్ గ్రీన్ హీరో'' అంటూ అనే బ్యాగ్రౌండ్ సాంగ్ కంపోజ్ చేసిచ్చాడు. మొత్తంగా ఈ లుక్ అదిరిపోయిందంతే. అలాగే రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ వారి లోగో డిజైన్ కూడా అదిరిపోయింది.



కాకపోతే ఇప్పటి ఎక్కడా కూడా చిరంజీవి ఫేస్ అస్సలు చూపించలేదనే చిన్న వెలితి, చిరు సగం ఫేస్ లుక్ తో కాస్త తీరిందని అనుకోవచ్చు. మొత్తానికి ఖైదీ సిరీస్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వటమే కాదు, హ్యాట్రిక్ కొట్టేందుకు మన మెగాస్టార్ సిద్ధమైపోతున్నాడనే అనుకోవచ్చు. ఇక సాయంత్రం రిలీజ్ కాబోయే టీజర్ కోసం అంతా రెడీకండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  chiranjeevi  150th movie  first look  motion poster  

Other Articles