రాంచరణ్ మంచులక్ష్మీ దంపతుల పార్టీ | ram charan and manchu lakshmi couple enjying private party

Ram charan and manchu lakshmi couple enjoying private party

Manchu Lakshmi Ram Charan, Ram Charan Manchu Lakshmi, Mega and Manchu Private Party, Manchu Lakshmi shared Mega pic

రాంచరణ్ మంచులక్ష్మీ దంపతుల పార్టీ | ram charan and manchu lakshmi couple enjying private party

మెగా-మంచు ప్రైవేట్ పార్టీ జరిగిపోయింది

Posted: 07/28/2016 12:52 PM IST
Ram charan and manchu lakshmi couple enjoying private party

తెలుగు సినీ పరిశ్రమలో మెగా-మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. చిరు-మోహన్ బాబులు పైకి విసుర్లు విసురుకుంటున్నట్లు కనిపించినా, లోపల మాత్రం మంచి స్నేహ బాంధవ్యాన్నే కొనసాగిస్తుంటారు. అయితే టామ్ అండ్ జెర్రీలా వీరి ఆట సాగుతుండగా, వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటి నుంచి మాంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు.

అంతా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, పెళ్లిళ్లకు, పంక్షన్ లకు హాజరుకావటం, సందడి చేయడం షరా మాములే. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ రెండు కుటుంబాలు ఓ ప్రైవేట్ పార్టీ చేసుకున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్, భార్య ఉపాసన, మంచు లక్ష్మీ, తన భర్త ఆండీ శ్రీనివాస్ ఈ పార్టీలో పాల్గొన్నారంట. థాయ్ లాండ్ లోని ఖోసముయ్ అనే ప్రాంతంలో వీరంతా వీకెండ్ ను జాలీగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేకపోయినా ఇందుకు సంబంధించిన ఫొటోను మాత్రం మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతాలో రెండు రోజుల క్రితం పోస్ట్ చేసింది.

కాగా, ప్రస్తుతం రాంచరణ్ తమిళ హిట్ తనిఒరువన్ రీమేక్ ‘ధ్రువ’ లో బిజీగా ఉండగా, మంచులక్ష్మీ ‘లక్ష్మీ బాంబ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె పవర్ ఫుల్ జడ్జి పాత్రలో అలరించనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Ram Charan  Upasana  Thailand  Private Party  

Other Articles