అలియా భట్ కు మాస్ రోల్స్ కావాలంట | Alia Bhatt desires to do massive masala movie

Alia bhatt desires to do massive masala movie

alia bhatt wants katrina kaif, alia bhatt masala movie, alia bhatt hot roles, alia bhatt dream role

Alia Bhatt desires to do massive masala movie.

అలా పడితేనే హ్యపీగా ఫీలవుతుందట

Posted: 07/26/2016 10:34 AM IST
Alia bhatt desires to do massive masala movie

ఫస్ట్ సినిమాలోనే బికినీలో కనువిందు చేసి కేవలం గ్లామర్ తోనే నెట్టుకొస్తోంది అన్న విమర్శలు ఎదుర్కొంది అలియా భట్. మహేష్ భట్ కూతురు అయినప్పటికీ ఆమె నటనలో ఏమాత్రం పస లేదని అంతా పెదవి విరిచారు. అయితే హైవే, ఉడ్తా పంజాబ్ సినిమాలతో ఆ విమర్శలకు చెక్ పెట్టింది.

అయితే అలాంటి రియలిస్టిక్ సినిమాలే కాదు, మసాలా ఉన్న సినిమాలు కూడా తనకు చాలా ఇష్టమని చెప్పింది. ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలియా మాట్లాడుతూ, కేవలం ఆర్ట్ సినిమాలు, హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని అనుకోవద్దని తెలిపింది. మాంచి మాస్ మసాలా సినిమాలో నటించాలని ఉందని అలియా అంటోంది.

అంటే కత్రినా కైఫ్ లా ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’ అని చేయాలని ఉందట. దర్శకులు వింటున్నారా? కాస్త ఎంకరేజ్ చేయండమ్మా... ప్రస్తుతం డియర్ జిందగీలో నటిస్తుండగా, షారూఖ్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt  massmovie  dear zindagi  sharukh khan  

Other Articles