కబాలి మీద సెటైర్ వేసిన సంపూ | sampoo tweet on Rajanikanth Kabali

Sampoo tweet on rajanikanth kabali

sampoornesh babu kabali, sampoo kabali, kabali sampoo, sampoo pawan SGS, sampoo Mahesh Brahmotsavam, Sampoo satires on Super Stars

sampoornesh babu tweeted on Pawan, Mahesh and Rajanikanth about thier much hype flops.

కబాలి మీద సెటైర్ వేసిన సంపూ

Posted: 07/26/2016 10:06 AM IST
Sampoo tweet on rajanikanth kabali

స్ఫూఫ్ సినిమాతో ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సింగం 123 బోల్తా పడ్డప్పటికీ  ప్రస్తుతం కొబ్బరి మట్టలో బిజీగా ఉన్నాడు. అయితే ఉన్నోడు ఉండక ఏకంగా  స్టార్లపైనే సెటైర్లు వేస్తున్నాడు. ట్విట్టర్ లో సంపూ చేసిన ఓ ట్వీట్ పై ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఏకంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ పైనే జోకులు పేలుస్తున్నాడు.

ఈ 2016కి ఏమైంది ఓ పక్క సర్దార్ గబ్బర్ సింగ్, మరోపక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమ గీతం అంటూ ఓ సంపూ వీరాభిమాని చేసిన ట్వీట్ ను పోస్ట్ చేశాడు సంపూ. ఎవరో పంపించారు... సరదాకి తీసుకోండి అంటూ పేర్కొన్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం భారీ అంచనాల మధ్య వచ్చి దారుణంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కబాలి కి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో వీటిని తన సినిమా ప్రమోషన్ కోసం సరదాగా ఇలా వాడుకుంటున్నాడన్న మాట.  మరి దీనిపై ఆయా స్టార్ల రియాక్షన్ ఎలా ఉండబోతుందో...


-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh  Twitter  Rajanikanth  Kabali  

Other Articles