నవ్వుల నటకిరీటి రాజేంద్రుడు | Natakiriti rajendra prasad birthday special

Natakiriti rajendra prasad birthday special

Natakiriti rajendra prasad, rajendra prasad birthday special, Actor rajendra prasad birthday, Natakiriti birthday special, MAA president Rajendra Prasad, king of comedy rajendra prasad

Natakiriti rajendra prasad birthday special

నవ్వుల నటకిరీటి రాజేంద్రుడు

Posted: 07/19/2016 11:12 AM IST
Natakiriti rajendra prasad birthday special

ఆయన పంచిన నవ్వులను ఏరుకుంటూ ఈనాటికి లాఫింగ్ థెరపీగా వాడుకుంటున్నారు ఎందరో. జాతకాల పిచ్చోడిగా అలరించాలన్న, పిసినారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అప్పులతో జీవితం నెట్టుకొచ్చిన, మోసాలతో లైఫ్ లో సెటిల్ అయినా, ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ అన్నా... ఇలా ఎలాంటి పాత్రలతో అయినా నవ్వులు పూయించడం ఒక్క నటకిరీటికి మాత్రమే సొంతం. అసలైన హాస్యం విషాదం నుంచే పుడుతుందనటానికి రాజేంద్ర ప్రసాదే నిదర్శనం. చిన్న తనంలోనే తల్లి చనిపోవటంతో ఆ  బాధను దిగమింగుకునేందుకు హాస్యాన్ని ఆశ్రయించారు. ఆపై అవే నవ్వులు మనకు పంచారు. చిన్నప్పుడే ముఖానికి రంగు వేసుకుని నాటకాలు వేశారు. రాజేంద్రుడిలోని పట్టుదల చూసిన నటసార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జంధ్యాల, వంశీ, రేలంగిలతోపాటు ఇవీవీ, ఎస్పీ కృష్ణారెడ్డి.... ఆపై మరికొందరు ఇలా మూడు తరాల దర్శకులతో ఆయన పని చేశారు. ముఖ్యంగా హాస్యబ్రహ్మ జంధ్యాలతో మరిచిపోలేని చిత్రాలను అందించాడు. రాజేంద్రుడి చిత్రాలను రీమేక్ చేసే సీన్ దమ్ము ఇప్పుడున్న దర్శకులకు లేదు. ఎందుకంటే ఆయనలా అభినయించే హీరోలు లేకపోవటమే అందుకు కారణం. హీరోగా రాణిస్తున్న టైంలోనే 90వ దశకంలో నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు తీసి, చేతులు కాల్చుకున్నారు. కాస్త గ్యాప్ తో ఆయన్నే వెతుకుంటూ ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ తరం హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న నటకిరీటి, ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈరోజు(జూలై 19) ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి....

- రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు డాక్టర్‌ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్‌. 1956 జూలై 19న కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన జన్మించారు.
- సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లామా పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం(1977) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగ దశాబ్దాలకు చేరువైన ఆయన సినీ ప్రస్తానంలో   ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించారు.
- ప్రేమించు పెళ్లాడు చిత్రంతో హీరోగా మారినప్పటికీ, ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం వంశీ లేడీస్ టైలర్(1986).
- 1991లో రిలీజ్ అయిన ఎర్ర మందారం సినిమాకు తొలిసారిగా నంది అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్. 1994లో రిలీజ్ అయిన మేడమ్ సినిమాకు స్పెషల్ జ్యూరి అవార్డ్ ను అందుకున్నారు. ఇక పాతికేళ్ల    తర్వాత మరోసారి 2004లో ఆ నలుగురు చిత్రానికి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్నారు.
- తెలుగు, తమిళ్ లో మొత్తం కలుపుకుని 230కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన క్విక్గన్ మురుగన్ పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలోనూ హీరోగా నటించారు.
-  ఆయన హీరోగా నటించిన పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, మీ శ్రేయోభిలాషి చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నాయి.
- నటకిరిటీగా, కామెడీ కింగ్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే రాజేంద్రుడిని ఆంధ్రా యూనివర్సిటీ గౌరమ డాక్టరేట్ తో సత్కరించింది.

ప్రస్తుతం నటుడిగానే కా మా అధ్యక్షుడు తెలుగు కళామతల్లి సేవచేసుకుంటున్నారు ఈ నవ్వుల రారాజు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ... తెలుగు విశేష్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Natakiriti  Rajendra Prasad  Birthday Special  

Other Articles