టూమచ్: జనతా గ్యారేజ్ వీడియో క్లిప్ లీక్ | jantha garaje song making video viral

NTR jantha garaje Video song, jantha garaje Video song leaked, NTR video song leaked

NTR jantha garaje song making video viral.

టూమచ్: జనతా గ్యారేజ్ వీడియో క్లిప్ లీక్

Posted: 07/09/2016 05:30 PM IST

లీకేజీల పర్వం సినిమా విడుదల కాకముందే బాలీవుడ్ లో ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ప్రమోషన్ కోసమో లేక మరెవరైనా చేసే పనో తెలీట్లేదు కానీ ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతోంది. తాజాగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ జనతా గ్యారేజ్ విషయంలోనూ ఇదే జరిగింది.

కాకపోతే సినిమా లోని ఓ వీడియో సాంగ్ షూటింగ్ బిట్ ను ఎవరో ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీ లో అప్ లోడ్ చేశారు. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ తనదైన స్టైలిష్ స్టెప్పులతో అలరించాడు. దేవీశ్రీ ప్రసాద్ అలాపించిన ఈ పాట రిఫ్రెషింగ్ గా ఉండేట్లు అనిపిస్తోంది. ముంబై బ్యాగ్రౌండ్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా ఇది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో ఆదే పాటకు సంబంధించిన వీడియోను ఎవరో అభిమాని అప్ లోడ్ చేయగా, దానికి సంబంధించిందే ఈ పాట వీడియో అని తెలుస్తోంది. దీనిని పట్టుకుని కొన్ని వెబ్ సైట్లు వీడియో సాంగ్ లీకైందంటూ ఊదరగొట్టడం విశేషం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  jantha garaje  Video song making  leaked  

Other Articles