శర్వానంద్ మరీ ఇంత చెండాలం చేశాడా? | rajadhiraja director cheran fire on sharwanand

Rajadhiraja director cheran fire on sharwanand

Cheran fire on Sharwanand, Sharwanand negative promotion for Rajadhiraja, Cheran alleges that sharwanand reason for Rajadhiraja flop

Director Cheran fire on sharwanans and nithya menon for not attend promotions for Rajadhiraja Movie.

శర్వానంద్ మరీ ఇంత చెండాలం చేశాడా?

Posted: 07/04/2016 11:11 AM IST
Rajadhiraja director cheran fire on sharwanand

యువ నటుడు శర్వానంద్ కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అద్భుతమైన నటనే కాదు, సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ పోతాడని అందరికీ తెలిసిందే. ప్రస్థానం, అందరి బంధువయ్యా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, ఇలా ప్రత్యేక జోనర్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు అవుతున్నా శర్వా మీద ఇంత ఒక కంప్లెయింట్ లేదు. కానీ, తాజాగా ఓ దర్శకుడు బహిరంగంగానే అతనిపై విమర్శలు గుప్పించటం చర్చనీయాంశమైంది.

ఇటీవల శర్వానంద్ నటించిన రాజాధిరాజా చిత్రం విడుదలైంది. నా ఆటోగాఫ్ర్ మాతృక దర్శకుడు అయిన చేరన్ ఈ సినిమాకు దర్శకత్వం. నాలుగేళ్ల క్రితం రావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో చాలాసార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది. రెండేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయినప్పటికీ అట్లర్ ఫ్లాప్ అయ్యింది. ఏమిటో ఈ మాయ టైటిల్ తో అప్పుడే రావాల్సిన ఈ సినిమాను రాజా సెంటిమెంట్ తో రాజాధిరాజాగా మార్చిఈ మధ్య తెలుగులోనూ మోక్షం కల్పించారు. నిత్యమీనన్, ప్రకాజ్ రాజ్ లాంటి స్టార్ క్రూ ఉండటంతో ఆడుద్దిలే అనుకున్న చిత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అయితే హీరో శర్వానంద్ సినిమాకు ప్రచారం చేయకపోగా, పని కట్టుకుని నెగటివ్ ప్రచారం చేశాడంట. దీంతో చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు చేరన్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ శర్వాపై విమర్శలు చేశాడు.

వరుస ఫ్లాపులతో సినిమాలు లేని టైంలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాను. కుదరకపోతే ప్రమోషన్ చేయకుండా ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ ఓ రెండు మూడు హిట్లు పడ్డాయన్న తలపొగరుతో ఇలా నెగటివ్ కామెంట్లు చేయటం సరైంది కాదు అంటూ దులిపేశాడంట. పనిలో పనిగా హీరోయిన్ నిత్యామీనన్ పై కూడా విమర్శలు కురిపించాడు చేరన్. శర్వానంద్ ఇంతకి దిగజారడా అంటూ ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఇదే చర్చ.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheran  Raajadhiraja  Sharwanand  nithya menon  

Other Articles