ఫ్లాప్ హీరో ఈ యేషాలు ఏంటో... | Varun Sandesh Tumse Kehna Tha release date announced

Varun Sandesh Tumse Kehna Tha album, varunsandesh pop album, varun sandesh hindi album, varun sandesh album

Tollywood hero Varun Sandesh Tumse Kehna Tha album released on july 10.

ఫ్లాప్ హీరో ఈ యేషాలు ఏంటో...

Posted: 07/02/2016 11:53 AM IST

అప్పట్లో ఏకంగా డజనుకు పైగా ఫ్లాపులతో తెలుగు సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించాడు యంగ్ హీరో నితిన్. అయితే ఆ వెంటనే తప్పుతెలుసుకుని, మేలుకొని తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను ఎంచుకుని ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నాడు. నితిన్ అంత కాకపోయినా రమారమీ ఆ రికార్డుకు చేరవయ్యాడు ఇప్పుడు మరో యంగ్ హీరో.

'హ్యాపీ డేస్' తో వెలుగులోకి వచ్చి కొత్త బంగారు లోకం అంటూ సందడి చేసిన వరుణ్ సందేశ్ సింగిల్ హీరోగా వరుసగా రెండు మూడు సక్సెలు అందుకున్నాడు. కానీ, ఆపై గాచారం బాగోలేకపోవటంతో వరుసగా ఫ్లాపులతో బొక్కా బోర్లా పడ్డాడు. చివరగా ఏమైంది ఈ వేళ... చిత్రం సోలో హిట్ కాగా, పాండవులు పాండవులు తుమ్మెద కాస్త ఆడింది. మధ్యలో ఎన్ని చిత్రాలు వచ్చి వెళ్లాయో వరుణ్ కి కూడా గుర్తు లేన్నట్లు ఉంది. పెళ్లాయక అయిన ఫేట్ మారుద్ది అనుకున్న ఈ యంగ్ హీరోకి అవకాశాలు రావటమే గగనంగా మారింది. దీంతో కొత్త రూట్ ఎంచుకున్నాడు.

త్వరలో ఓ మ్యూజిక్ వీడియో ఆల్బం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. 'తుమ్సే కెహనా థా' పేరిట హిందీలో రూపొందిన ఈ వీడియో మ్యూజిక్ ఆల్బం జూన్ 3న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా,  ఈ నెల 10న ఆల్బమ్ విడుదల కానుంది.  ఇందులో కాస్త రిఫ్రెషింగ్ లుక్ తోనే కనిపిస్తున్నాడు. మోడల్ సీమా ఇందులో వరుణ్ కి జోడీగా కనిపిస్తోంది. అన్నట్లు దీనికి వరుణ్ సందేశ్ నిర్మాత, కౌశిక్ పెగలపాటి దర్శకుడు. మరి దీంతో అయినా మనోడి ఫేట్ మారుద్దా చూద్దాం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Sandesh  Tumse Kehna Tha album  happydays hero  

Other Articles