actor satyaraj next coming movie dora in telugu

Actor satyaraj next coming movie dora in telugu

sathya raj, kattappa, why kattappa kill bahubali, kattappa, sathyaraj, sathyaraj next, sathyaraj movies, sathyaraj dora, sathya raj upcoming movie, sathyaraj garu, sathyaraj kannada artist, sathyaraj tamil artist

actor satyaraj next coming movie dora in telugu . in this movie his son sibiraj hero and sathyaraj playing ghost charector.

'దొర' గా అందరినీ భయపెడతా..!

Posted: 06/29/2016 11:33 AM IST
Actor satyaraj next coming movie dora in telugu

కట్టప్ప క్యారెక్టర్ తో ప్రపంచానికే పరిచయం అయిపోయాడు ఆర్టిస్ట్ సత్యరాజ్. గతంలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కట్టప్పగానే అందరికీ గుర్తుండిపోయానని చెప్తున్నాడు సత్యరాజ్. సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలసి నటించిన తమిళ హారర్ ఎంటర్ టైనర్ "జాక్సన్ దొరై' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఇది ఒక కొత్తరకమైన హారర్ సినిమా. దీనిని తెలుగులో 'దొర' అనే టైటిల్ తో అనువదిస్తున్నాం. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్. అన్ని అంశాలున్నాయి. జాక్సన్ అనే బ్రిటీష్ దెయ్యానికీ, దొర అనే ఇండియన్ దెయ్యానికీ మధ్య కథ జరుగుతుంది. నేను ఇండియన్ దెయ్యం దొర పాత్రలో నటించాను. ఆత్మగా నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మంచి కథ రావడంతో అంగీకరించాను. హారర్ సినిమా చేయడానికి అంతకు మించి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు , దెయ్యాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. గోస్ట్ క్యారెక్టర్కి మేనరిజమ్స్, రిఫరెన్స్లు కూడా ఏమీ లేవు. నా స్టయిల్లో చేసుకుంటూ వెళ్లాను అంతే అని చెప్పాడు.

దర్శకుడు చెప్పిన సూచనలు పాటించాను. క్యారెక్టర్లో ఈజీగానే నటించా, నా కుమారుడు శిబిరాజ్, నేను కలసి తమిళంలో ఇంతకు ముందు నటించాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ నెం.1 తమిళ రీమేక్ తో  శిబిరాజ్ హీరోగా అయ్యాడు. గత పదేళ్లుగా నటిస్తున్నాడు. తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడనే నమ్మకముంది.  తెలుగు, తమిళ భాషల్లో దర్శకులందరూ నన్ను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పారు.   

200 సినిమాలు దాటిన తర్వాత క్యారెక్టర్ ఆర్జిస్టుగా జర్నీస్టార్ట్ చేశా. 38 ఏళ్లుగా నటిస్తున్నప్పటికీ, ప్రస్తుతం అందరూ "కట్టప్ప'' అని పిలుస్తుంటే చాలా బాగుందన్నారు. చిన్నారులు కూడా అంతే. ఈ క్రెడిట్ రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని అది నాకు రావడం అదృష్టమని చెప్పాడు.  దొర సినిమాతో పాటుగా సంతోష్ శ్రీనివాస్ సినిమాలో హీరో రామ్ తండ్రిగా నటిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా నందమూరి కళ్యాణ్ రామ్ ''పటాస్" తమిళ రీమేక్ లో సాయికుమార్ చేసిన పాత్రను చేస్తున్నానని చెప్పాడు కట్టప్ప.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sathyaraj artist  kattapa  kattappa in bahubali  sathyaraj son  sibiraj  sathyaraj dora movie  

Other Articles