ఏంటి? | Chiru appears Khaidi No 150 for Kathilantodu

Chiru appears khaidi no 150 for kathilantodu

Chiru Khaidi No 150, Kathilantodu 150, Chiranjeevi in Chanchalguda Jail, Chiru attire 150 was printed, చిరు 150, ఖైదీ నంబర్ 150, తాజా వార్తలు, చిరు 150, కత్తిలాంటోడు ఖైదీ నంబర్ 150

Chiru appears Khaidi No 150 for Kathilantodu. Chiranjeevi was spotted walking on the road near Chanchalguda Jail, in Hyderabad during the shoot of the movie, he was seen in jail attire and the number 150 was printed on it.

చంచల్ గూడ జైలులో ఈ 150 గోల ఏంటి?

Posted: 06/29/2016 10:52 AM IST
Chiru appears khaidi no 150 for kathilantodu

చిరు 150 మొదలవ్వటం మాట ఏమో గానీ తెలుగు అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. తన మేనరిజంతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచడంతోపాటు, స్టైల్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టిని మెగాస్టార్ తిరిగి మేకప్ వేసుకోవటంతో అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. ఇక ఆ అంచనాలను అందుకునేలా చిత్రాన్ని రూపుదిద్దుతున్నాడు మాస్ డైరక్టర్ వినాయక్.

ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని జైలు సీన్లను షూట్ చేస్తున్నారు. కథ ప్రకారం దొంగ పాత్రలో చిరు జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. దీనికోసం సెట్ కాకుండా ఏకంగా చంచల్ గూడ్ జైలులోనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే అంతకు ముందు చాలా సినిమాల్లో ఖైదీ నంబర్ 786గా అలరించిన ఆయన ఇప్పుడు మారిపోయారు. 150వ చిత్రం కావటంతో అదే నంబర్ వచ్చేలా ధరించిన ఖైదీ డ్రస్ లో కనిపించనున్నారు. అందుకు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు లీకైంది.

ఇక రైతుల సమస్యల ప్రధాన ఇతివృత్తంగా రాబోతున్న ఈ చిత్రంలో డైలాగులు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయంట. ఇప్పటికే లీకైన కొన్ని డైలాగులు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పరుచూరి బ్రదర్స్ అందించిన ఈ సంభాషణలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దుక్కి దన్నడమే రైతులకు తెలుసు... దుర్మార్గం తెలీయదు, నాగలి పట్టడమే వీళ్లకు తెలుసు.. నరకడం తెలియదు ఇంత పవర్ ఫుల్ డైలాగ్ చిరు నోట నుంచి ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆత్రుతతో చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  150 movie  Kathilantodu  Khaidi No 150  

Other Articles