maruthi and venkatesh combination movie going to chennai

Maruthi and venkatesh combination movie going to chennai

vekatesh and maruthi moive, babu bangaram movie, vekatesh bangaram, venkatesh upcoming movie, venkatesh comedy, maruthi comedy movie, venky movie, venky and nayanatara, nayantara heroine, actress nayana hot

hero venkatesh next movie with maruthi direction going to chennai for a song shooting. this is movie final schedule and movie releasing on july 29th

బాబు క్లైమాక్స్ కి వచ్చాడు..!

Posted: 06/28/2016 12:31 PM IST
Maruthi and venkatesh combination movie going to chennai

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటరై టైనర్ సినిమా ‘బాబు బంగారం’.  ఈ సినిమాతో వెంకటేష్ తన మార్కెట్ ని పెంచుకుంటూ తనలోని స్టామినాను నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల గచ్చిబౌలిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రయూనిట్ ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి చేసిందట. ఈ పాట కోసం చెన్నైలో ప్రత్యేక సెట్ సిద్ధం చేయించారట దర్శకుడు మారుతి. జులై 4 నుండి 8 వరకు జరుగనున్న షూటంగ్‌తో ఈ పాట కూడా పూర్తవుతుందని అక్కడే సినిమాకి క్లైమాక్స్ అయిపోతుందని, గుమ్మడికాయ కొట్టేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు.  జిబ్రాన్ స్వరాలు సమకూర్చిన పాటలు జులై 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయట. జులై 29 నాటికి ‘బాబు బంగారం’ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార వెంకీ సరసన నటిస్తున్న సంగతి తెలసిందే.

యంగ్ లుక్ తో , ఫ్రెష్ సబ్జెక్ట్ తో వెంకటేష్ సినిమా క్లైమాక్స్ కి చేరుకుందని, ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచిపోతుందని ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గత సినిమాతో మారుతి కూడ ఓవర్సీస్ మార్కెట్ ని ఆక్రమించాడు కాబట్టి ఈ సినిమా బిజినెస్ కూడ అక్కడ బాగా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maruthi director  venkatesh  venky  nayana tara  babu bangaram movie  

Other Articles