puja hegde selected as heroine in allu arjun next movie

Puja hegde selected as heroine in allu arjun next movie

puja hot, puja hegde hot, puja hegde bollywood, mukunda heroine, dil raju next movie, harish shankara and bunny combo, bunny movie heroine, bunny movie, allu arjun next movie

actress puja hegde confirmed as a heroine in allu arjun next movie with harish shankar direction. this movie is producing by dil raju in sri venkateswara banner

బన్నీ సరసన పాప ఫిక్స్..!

Posted: 06/28/2016 10:58 AM IST
Puja hegde selected as heroine in allu arjun next movie

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ తన తర్వాత సినిమాకి వేగంగా పావులు కదుపుతున్నాడు. ‘సరైనోడు’ సినిమాతో తనలోని స్టైల్‌తో పాటు ఊర మాస్‌ని చూపించిన బన్నీ ఇప్పుడు హరీష్ శంకర్ తో ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి రెడీ అయిపోతున్నాడు. పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’, సాయిధరమ్ తేజ్‌కి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి విజయాలు అందించిన హరీష్ ఇప్పుడు బన్నీతో సూపర్ హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు సమాచారం. నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాల్లో నటించిన పూజ ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు కమిట్ కాలేదు. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ సరసన భారీగా తెరకెక్కిన ‘మొహంజొదారో’ సినిమాలో నటిస్తోంది.
 
‘ఆర్య’తో యూత్, ‘పరుగు’తో ఫ్యామిలీ ప్రేక్షకులకు అల్లు వారబ్బాయిని దగ్గర చేసిన ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘‘ఏడేళ్ల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న చిత్రమిది. అతని ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథను హరీష్ సిద్ధం చేశారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puja hegde  allu arjun  allu arjun movies  dil raju producer  director harish shankar  

Other Articles