చైతూ కరెక్ట్ ట్రాక్ ఎక్కాడు | naga chaithanya premam audio date fixed

Naga chaithanya premam audio date fixed

Naga chaithanya premam audio, premam audio date fixed, Naga chaithanya Premam movie, Premam movie release date, Premam movie news, ప్రేమమ్ ఆడియో తేదీ ఫిక్స్, చైతూ ఆడియో ఫంక్షన్

Naga chaithanya premam audio date fixed. Premam telugu Movie may released on August 12.

చైతూ కరెక్ట్ ట్రాక్ ఎక్కాడు

Posted: 06/27/2016 05:59 PM IST
Naga chaithanya premam audio date fixed

తనకు ఏ మాత్రం సూటవ్వని మాస్ కథలతో సినిమాలు చేస్తూ దెబ్బలు తిన్నాడు చై అదేనండీ మన నాగ చైతన్య. మనం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అది మనోడి సోలో ఖాతాలోకి రాదు. ఒక లైలా కోసం, ఆటోనగర్ సూర్య, దోచెయ్ లతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొని చివరికి తప్పులు తెలుసుకున్నాడు. తనకు అచ్చొచ్చిన ప్రేమకథలతో మరోసారి ముందుకు రాబోతున్నాడు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో అంటూ వస్తున్న చైతూ తన తదుపరి ప్రాజెక్టును శరవేగంగా రూపొందిస్తున్నాడు. మళయాళం హర్ట్ టచింగ్ ప్రేమకథ ప్రేమమ్ రీమేక్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. జూలై 14 న ఫారిన్ లో జరిగే షూటింగ్ తో సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం.

ఇక మెలోడీ స్వరాల స్పెషలిట్ గోపీ సుందర్ అందిస్తున్న ఆడియోను ఆగష్టు 7న విడుదల చేయనున్నారు. చైతూకి జోడీగా ముగ్గురు భామలు జోడీకడుతున్నారు. మరి ఈ క్లాస్ సినిమాతోనైనా తనకు దూరంగా ఉన్న సక్సెస్ ను అందుకుంటాడా చూడాలి.

భాస్కర్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaithanya  premam audio  shruthi hassan  

Other Articles