స్టార్ హీరో కూతురు పెళ్లికి రెడీ | Chiyan Vikram daughter ready for marriage

Chiyan vikram daughter ready for marriage

మాజీ సీఎం మనవడితో స్టార్ కూతురి పెళ్లి, Chiyan Vikram daughter ready for marriage, Vikram daughter Akshitha, విక్రమ్ కూతురి పెళ్లి మాజీ సీఎం మనవడితో, మాజీ సీఎం మనవడితో విక్రమ్ కూతురు, తాజా వార్తలు, కోలీవుడ్ న్యూస్, cine news, latest news

wedding bells at chiyan vikram home. His daughter Akshitha tie the knot with karunandhi grandson manu ranjith.

స్టార్ హీరో కూతురు పెళ్లికి రెడీ

Posted: 06/27/2016 03:48 PM IST
Chiyan vikram daughter ready for marriage

మరో టాప్ హీరో కూతురు త్వరలో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైపోతుంది. విలక్షణమైన నటనతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాడు కోలీవుడ్ నటుడు విక్రమ్. ఆయన కుమార్తె అక్షితను త్వరలో ఓ ఇంటిదాన్ని చేసి సాగనంపేందుకు విక్రమ్ చూస్తున్నాడంట.

ప్రముఖ వ్యాపారవేత్త, సీకే బేకరీ యజమాని రంగనాథన్ ఫ్యామిలీకి చెందిన మను రంజిత్ తో ఆమె వివాహం నిశ్చయించినట్లు విక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. మను డీఎంకే చీఫ్ కరుణానిధి మనవడు కూడా.  జూలై10న ఏ ఆర్భాటం లేకుండా ఓ స్టార్ హెటల్లో ఇరు కుటుంబాల సమక్షంలోనే ఎంగేజ్ మెంట్ నిర్వహించి, వచ్చే ఏడాది గ్రాండ్ గా వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ప్రస్తుతం కారికాలన్, ఇరుమురుగన్, గరుడా చిత్రాలతో బిజీగా ఉన్న విక్రమ్ మరో పక్క కూతురి వివాహవేడుక కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడంట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiyan Vikram  Akshitha  manu ranjith  

Other Articles