director ravibabu next movie with pig animation movie

Director ravibabu next movie with pig animation movie

ravibabu, ravibabu pig story, pig story movie, ravibabu pig, director ravibabu, tollywood ravibabu, ravibabu pig pig pig, ravi babu next movie

director ravibabu different movie coming soon with pig. in this movie he is originally animated pig and original pig mix

రవిబాబు ముద్దుల పందిపిల్ల...!

Posted: 06/27/2016 10:50 AM IST
Director ravibabu next movie with pig animation movie

'అల్లరి' 'అనసూయ‌' 'అవును' వంటి డిఫరెంట్ కామెడి, ల‌వ్‌, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల‌ను ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించి డైరెక్టర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శకుడు ర‌విబాబు. ఇప్పుడు మ‌రి కాస్తా డిఫ‌రెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటుంది.

డైరెక్టర్ ర‌విబాబు మాట్లాడుతూ ``ఏడాదిన్నర క్రితం నాకు ఈ సినిమా ఆలోచ‌న వ‌చ్చింది. అందుకోసం మ‌న తెలుగు ఆడియన్స్ కు త‌గిన విధంగా కథను త‌యారుచేశాను. పందిపిల్ల ఎలా ప్రవ‌ర్తిస్తుంది ? అనే దానిపై స్టడీ కూడా చేశాను. యానీమెట్రిక్ సాఫ్ట్వేర్ ను ఉప‌యోగించాలంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నికావ‌డంతో సిలికాన్‌తో పందిపిల్ల మోడ‌ల్‌ను త‌యారుచేశాం. అయితే సినిమా చిత్రీక‌రించే స‌మ‌యంలో ఆ మోడ‌ల్ విరిగిపోయింది. దాంతో నిజ‌మైన పందిపిల్లతోనే సినిమా చిత్రీక‌ర‌ణ చేశాం అని తెలిపాడు రవిబాబు.

ఈ సినిమాని ఆద్యంతం కామెడీ గా తీసినట్లు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందంటున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.  

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director ravibabu movies  ravibabu pig movie  ravibabu pig cinema  pig cinema  

Other Articles