maheshbabu movie starting very soon

Maheshbabu movie starting very soon

maheshbabu next movie, maheshbabu movie, mahesh and murugadas movie, mahesh movie, murugadas movie, mahesh vs parineethi chopra, mahesh and parineethi, heroine parineethi chopra, mahesh upcoming movie

tollywood prince maheshbabu movie starting very soon in this year. the entaire team of this movie is planing to release the movie in sankranthi season

డైరెక్ట్ గా కెమెరా ముందుకే...!

Posted: 06/25/2016 01:51 PM IST
Maheshbabu movie starting very soon

మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తర్వాత మురుగదాస్ తో చేయబోయే సినిమా ఇప్పుడు ప్రిన్స్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ అవతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

లండన్‌ నుంచి విహారయాత్రను పూర్తిచేసుకొని రాగానే ఇక సినిమా స్టార్ట్‌ చేయడమేనంటున్నారు. మురుగదాస్‌ డైరక్షన్‌ లో వచ్చేనెల్లో రెండో వారంలో సినిమా ప్రారంభమై వెంటనే సెట్స్‌ పైకి వెళ్తుందట. ఇప్పటికే సినిమా పనులన్నింటిని దర్శకుడు పూర్తి చేశాడట. ఎనిమిది నిర్మాణ సంస్థలతో పాటు ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు ఈసినిమాలో నటించనున్నారట. అన్నీ పక్కాగా సిద్ధం చేసి ఉన్నాయట.

మరోవైపు లండన్‌ లో విహారయాత్రల్లో ఉంటూనే ఇంకోవైపు మహేష్‌ ఈ సినిమాలో తన క్యాస్టూమ్స్‌ , హెయిర్ స్టైల్స్ కి సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టాడట. గతంలో బాలీవుడ్‌ హెయిర్‌ స్టైలిష్‌ మహేష్‌ ని మేకోవర్‌ చేశారట. అలాగే డ్రస్సింగ్‌ స్టైల్‌ కూడా బాలీవుడ్‌ వాళ్లేనట.

అప్పట్లో వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్‌ సిక్స్ ప్యాక్‌ బాడీతో కనిపించడానికి బాలీవుడ్‌ డైటీషియన్లు, ఫిట్‌ నెస్‌ సలహాలు తీసుకున్నాడు. ఇప్పుడు మురుగదాస్‌ సినిమాలో రఫ్‌ అండ్‌ టఫ్ గా ముఖ్యంగా గెడ్డంలో మహేష్‌ కనిపిస్తాడని టాక్‌. ఆ విధంగా మేకోవర్‌ అవ్వడానికి హాలీవుడ్‌ స్టైలిషర్స్‌ ని సంప్రదించినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ భామ పరిణీతిచోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తుండటంతో బడ్జెట్‌ రూ.100కోట్ల వరకు ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమాపై ఇప్పటినుంచే మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  prince mahesh  murugadas movie  mahesh heroines  mahesh bollywood  

Other Articles