chiranjeevi 150th movie kajal agarwal confirmed as heroine

Chiranjeevi 150th movie kajal agarwal confirmed as heroine

kajal agarwal, kajal herone, kajal next movie, kajal movies, kajal tollywood, chiru 150th movie heroine, kajal heroine, chiru movie herione, vinayak heroine, kajal heroine

chiranjeevi 150th movie kajal agarwal confirmed as heroine. producer ram charan strongly recommanding kajal in chiru movie

చిరు సినిమాకి హీరోయిన్ ఫిక్స్...!

Posted: 06/25/2016 11:32 AM IST
Chiranjeevi 150th movie kajal agarwal confirmed as heroine

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి అభిమానులకు మెగాస్టార్ మంచి బహుమతే ఇచ్చాడు. షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. గ్రాండ్ స్టార్ట్ అయిన 150వ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ లో అన్నయ్య గ్లామర్ చూసి సెట్ లో అందరికీ మతులు పోయాయి. ఈ సినిమాలో అన్నయ్య సరసన హీరోయిన్ ఎవరా ? అని అందరూ అనుకుంటుంటే , ఒక భామ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. సర్దార్ సినిమాలో తమ్ముడితో జతకట్టి అందర్ని ఆకర్షించిన అందాల చందమామ కాజల్ నే ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ మాత్రం తమన్నాని హీరోయిన్ గా తీసుకుందామని అనుకుంటున్నాడట. అయితే, ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మాత్రం కాజల్ అగర్వాల్ ని తీసుకోమని గట్టిగా రికమెండ్ చేస్తున్నాడట. కాజల్ అయితే చిరంజీవి కి కరెక్ట్ గా సరిపోతుందని, ఇద్దరూ కలిసి స్టెప్పులు వేసినా చాలా అందంగా ఉంటుందని అంటున్నారు అందరూ. మరి వినాయక్ సినిమా అంటేనే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మరి ఈసారి కూడ వినాయక్ వీళ్లిద్దరినీ పెడతాడా లేదా కాజల్ అగర్వాల్ కి ఓటేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా కాజల్ ని తీసుకోవడం ఇక నామమాత్రమేనని, ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో కాజల్ ఎలాంటి సినిమాకి ఇంకా సైన్ చేయలేదని, ఖాళీగా ఉందని చెప్తున్నారు అందరూ. గతంలో చిరంజీవి కూడ సర్దార్ ఆడియో ఫంక్షన్ లో కాజల్ ని అందాల చందమామ అంటూ తెగ పొగిడిన సంగతి తెలిసిందే. దీనినిబట్టి కాజల్ అయితే అన్నయ్యకూడ అడ్డుచెప్పకపోవచ్చు అని చెప్తున్నారు అందరూ. ఇక కాజల్ పేరు అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడమే మిగిలి ఉంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiru movie actress  chiru movie heroine  kajal agarwal  chiru and vinayak movie  

Other Articles