Sonu Sood's wife Sonali robbed at IIFA event at madrid airport.

Sonu sood s wife sonali robbed at iifa

sonu sood wife robbed, villan wife robbed at airport, Sonali sood robbed, Sonu Sood's wife Sonali robbed at IIFA, సోనూసూద్ భార్య చోరీ, విలన్ భార్య బ్యాగ్ చోరీ, సోనూసూద్ కి దొంగ దెబ్బ, సినిమా వార్తలు, సోనూసూద్ భార్య, బాలీవుడ్ విలన్ బార్య, తాజా వార్తలు, latest news

Sonu Sood's wife Sonali robbed at IIFA event at madrid airport.

సోనూసూద్ భార్యకి చెమటలు పట్టించాడు

Posted: 06/25/2016 10:09 AM IST
Sonu sood s wife sonali robbed at iifa

చోరశిఖామణుల దాటికి బలవ్వని వారు ఎవరైనా ఉంటారా? సెలబ్రిటీలు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. అయితే ప్రతిష్టాత్మకంగా స్పెయిన్ లో నిర్వహిస్తున్న బాలీవుడ్ ఇఫా అవార్డుల సందర్భంగా ఓ బాలీవుడ్ నటుడు దొంగ దెబ్బకి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రముఖ నటుడు సోనూసూద్ ఆయన భార్య సోనాలితో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.  మాడ్రిడ్ ఎయిర్ పోర్టులో దిగగానే ఆమె హ్యాండ్ బ్యాగ్ ను ఒక వ్యక్తి కొట్టేశాడు. సుడిగాలి వేగంతో వచ్చిన దొంగ ఆమె బ్యాగ్ ను లాక్కుని పారిపోయాడు. పట్టుకునేందుకు సోనూసూద్ పరిగెత్తిన లాభం లేకపోయింది. ఈ హఠాత్ పరిణామంతో ఆయన భార్య సోనాలి గజగజ వణికిపోయిందట.

కాగా, ఆ బ్యాగ్ లో పాస్ పోర్ట్ తో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్కడి భారత దౌత్యాధికారికి, ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి ఆయన చేరవేశాడు. తాత్కాలిక ఏర్పాట్లు జరగకపోతే వారిద్దరు భారత్ కి వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు లేవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles