మిల్కీబ్యూటీతో పందెంకోడి రొమాన్స్ | Tamanna romance with Vishal

Tamanna romance with vishal

Tamanna romance with Vishal, Tamanna Vishal film updates, Vishal Jagapati babu film updates, Vishal telugu films, Vishal movie updates, Tamanna movies, Tamanna latest stills, Tamanna movies, Tamanna, jagapati babu

Tamanna romance with Vishal: Milky Beauty Tamanna upcoming film with tamil hero Vishal. This film shooting starts from 9 june.

మిల్కీబ్యూటీతో పందెంకోడి రొమాన్స్

Posted: 05/30/2016 09:22 AM IST
Tamanna romance with vishal

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం జూన్‌ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. 'రాయుడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి మాట్లాడుతూ.... భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. విశాల్‌ కెరీర్‌లో ఇది చాలా హై రేంజ్‌ మూవీగా నిలుస్తుంది. షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రిలీజ్‌ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 'రాయుడు' సూపర్‌హిట్‌ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్‌ సినిమా ఎనౌన్స్‌ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్‌ కూడా చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. విశాల్‌, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్‌ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. జూన్‌ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్‌ చెన్నై, ఫారిన్‌లలో చేస్తాం అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సూరి, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్‌, ఎడిటింగ్‌: సెల్వ, ఫైట్స్‌: దినేష్‌, అనల్‌ అరసు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌.జి.ప్రేమానందన్‌, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Vishal  Jagapati Babu  

Other Articles