ఆ తప్పులు మళ్లీ చేయనంటున్న నితిన్ | Nithin talks about his film career

Nithin talks about his film career

Nithin talks about Gunde Jaari Gallanthayyinde Sequel, Gunde Jaari Gallanthayyinde Sequel, Nithin movies, A Aa release date, A Aa Trailers, A Aa making videos, Nithin movies, A Aa posters

Nithin talks his film career and movies: Tollywood young hero Nithin upcoming film A Aa. This film will be release on 2 june. Nithin next Gunde Jaari Gallanthayyinde Sequel.

ఆ తప్పులు మళ్లీ చేయనంటున్న నితిన్

Posted: 05/28/2016 04:34 PM IST
Nithin talks about his film career

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తొలిసారిగా సీక్వెల్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. కానీ సీక్వెల్ కూడా సరిగ్గా సెట్ అయితేనే చేస్తానని చెబుతున్నాడు. నితిన్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నితిన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రమయ్యింది.

ఈ సినిమాకు సీక్వెల్ గా తీయడానికి దర్శకుడు మరియు నితిన్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు సంబంధించి దర్శకుడు విజయ్ కుమార్ కొండా మరియు చిత్ర రచయిత హర్షవర్ధన్ ఇప్పటికే స్క్రిప్టు పనిలో బిజీగా వున్నారు. కానీ ఈ ప్రాజెక్టుకు సెకండ్ హాఫ్ ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదని నితిన్ చెబుతున్నాడు.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ సీక్వెల్ కోసం ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తయ్యిందని, సెకండ్ హాఫ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తేనే చేయాలనుకుంటున్నానని నితిన్ అంటున్నాడు. 14 ఏళ్ల కెరీర్లో తాను చాలా ఎదురు దెబ్బలు తిన్నానని.. ఎలాంటి సినిమాలు చేయాలో.. ఎలాంటివి చేయకూడదో తనకు బాగా తెలిసొచ్చిందని నితిన్ చెప్పాడు. కాబట్టి అన్ని అనుకున్నట్లుగా జరిగితే తన సొంత బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తామని చెబుతున్నాడు. మరి ‘గుండెజారి గల్లంతయ్యిందే’కు సెకండ్ హాఫ్ సెట్ అయ్యేదెప్పుడో.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడో చూడాలి.

ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్, సమంత జంటగా నటించారు. ఈ సినిమాను జూన్2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Gunde Jaari Gallanthayyinde Sequel  A Aa  Samantha  

Other Articles