కన్ఫర్మ్: ఆరోజే ‘ఒక్క అమ్మాయి తప్ప’ విడుదల | Okka Ammayi Thappa Release Date Confirmed

Okka ammayi thappa release date confirmed

Okka Ammayi Thappa Release Date Confirmed, Okka Ammayi Thappa Trailers, Okka Ammayi Thappa Songs, Okka Ammayi Thappa movie stills, Okka Ammayi Thappa movie updates, Okka Ammayi Thappa movie updates, Nithya Menon movies, Nithya Menon movie news, Nithya Menon stills, Nithya Menon, Sundeep Kishan stills, Sundeep Kishan movies, Sundeep Kishan

Okka Ammayi Thappa Release Date Confirmed: Sundeep Kishan and Nithya Menon have teamed up for a unique romantic entertainer titled 'Okka Ammayi Thappa'. The film's talkie part has been wrapped up. Two songs will be shot abroad and one song will be shot in India. With this, the film's shooting will be complete.

కన్ఫర్మ్: ఆరోజే ‘ఒక్క అమ్మాయి తప్ప’ విడుదల

Posted: 05/28/2016 07:55 AM IST
Okka ammayi thappa release date confirmed

‘ప్రస్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యామీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10 న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.

నిర్మాత బోగాది అంజిరెడ్డి మాట్లాడుతూ... ఈ వారంలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. జూన్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసాము. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము. సందీప్‌ కిష‌న్‌ కెరీర్లో ఈ చిత్రం ఒక మైలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బంను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమా ట్రైలర్ కు యూట్యూబ్ లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అని ఆయన అన్నారు.

దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ.... నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. బోగాది అంజిరెడ్డి వంటి నిర్మాతగారు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఒక గంట పాటు సీజీ వర్క్ ఉంటుంది. కానీ అది తెలియదు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుది. అక్కడా షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి మిగతాదంతా గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశాం. నిత్యాగారు నాలుగు గంటల పాటు కథ విని ఒప్పుకున్నారు. అద్భుతంగా సపోర్ట్ చేశారు. అలాగే సందీప్ నన్ను నమ్మి సపోర్ట్ చేశారు. నిర్మాత అంజిరెడ్డిగారికి థాంక్స్. ఒక్క అమ్మాయితప్ప అందరినీ నవ్విస్తుంది, ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అని అన్నారు.

నటీనటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్, రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, నళిని, జ్యోతి, రేవతి తదితరులు. సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Okka Ammayi Thappa  Sundeep Kishan  Nithya Menon  

Other Articles