అందుకే ‘రోబో2’ చేయలేదంటున్న కమల్ | Reasons behind Kamal Haasan rejects robo2

Reasons behind kamal haasan rejects robo2

Reasons behind Kamal Haasan rejects robo2, Kamal Haasan Rejects Robo2, Kamal Haasan with Rajinikanth, Kamal Haasan latest interview, Kamal Haasan talks about Robo2, Kamal Haasan

Reasons behind Kamal Haasan rejects robo2: Tamil star hero Kamal Haasan Clarifies on Robo2 film offers and rejects. Kamal Haasan rejects robo2 film.

అందుకే ‘రోబో2’ చేయలేదంటున్న కమల్

Posted: 05/27/2016 05:45 PM IST
Reasons behind kamal haasan rejects robo2

తమిళ అగ్ర హీరో, ఉలగనయగన్ కమల్ హాసన్ ‘రోబో2’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘రోబో2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని శంకర్ ప్లాన్ చేసి, కమల్ తో ఓ ఫోటోషూట్ కూడా చేసారు. కానీ ‘రోబో2’కు కమల్ అంతగా సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లింది. ప్రస్తుతం రోబో2 చిత్రం రజనీకాంత్ హీరోగా రూపొందుతుంది. అయితే ‘రోబో2’ సమయంలో కూడా కమల్ హాసన్ ను దర్శకుడు శంకర్ సంప్రదించాడట. కానీ ఈసారి కమల్ తో విలన్ పాత్ర చేయించాలని శంకర్ భావించాడట. ఈ విషయాలను స్వయంగా కమల్ హాసన్ వెల్లడించారు.

‘రోబో2’ సినిమా చేయకపోవడానికి కమల్ వివరించారు. గతంలో రజనీ, కమల్ లు చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ వీరిద్దరి కాంబినేషన్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ సమయంలో మరోసారి కలిసి నటిస్తే మనలో ఎవరో ఒకరు ఆ సినిమాకు ఖచ్చితంగా నిర్మాత అయ్యి వుండాలని ఒప్పందం చేసుకున్నారట ఈ ఇద్దరు హీరోలు. అందువల్ల ‘రోబో2’కు వేరే నిర్మాతలు వుండటంవ వల్ల వీరిద్దరి మల్టీస్టారర్ సాధ్యం కాలేదట. కానీ సరైన కథ దొరికితే రజనీతో కలిసి నటించడానికి తానేప్పుడూ సిద్ధమేనని కమల్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Rajinikanth  Robo2  

Other Articles