కళ్యాణ్ రామ్ కోసం పూరీ స్పెషల్ డిజైన్ | Kalyan Ram Puri Jagannadh Film Updates

Kalyan ram puri jagannadh film updates

Kalyan Ram Puri Jagannadh film updates, Kalyan Ram romance with Aditi Arya, Kalyan Ram film updates, Kalyan Ram upcoming films, Kalyan Ram movie updates, Kalyan Ram movie news, Kalyan Ram stills, Aditi arya hot stills, Aditi arya

Kalyan Ram Puri Jagannadh Film Updates: Nandamuri Kalyan Ram upcoming film with director Puri Jagannadh. Miss India 2015 Aditi arya introducing as a heroine.

కళ్యాణ్ రామ్ కోసం పూరీ స్పెషల్ డిజైన్

Posted: 05/27/2016 05:18 PM IST
Kalyan ram puri jagannadh film updates

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్ తో మరో హిట్టు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ‘పటాస్’ సినిమాతో కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళుతున్నాడు.

‘టెంపర్’ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్, బాడీ స్టైల్ ను పూర్తిగా మార్చేయించి, చాలా స్టైలిష్ లుక్ లో చూపించాడు పూరీ. ఇపుడు కళ్యాణ్ రామ్ ను కూడా కొత్త లుక్ లో చూపించబోతున్నాడు. ఇటీవలే ముహూర్త కార్యక్రమాలను పూర్తి చేసుకొని, తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ చాలా స్టైలిష్, మాస్ గా వుండబోతుందట.

అందుకోసం పూరీ చాలా స్పెషల్ కేర్ తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లుగా సమాచారం. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మిస్ ఇండియా 2015 విన్నర్ అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Puri Jagannadh  Aditi arya  

Other Articles