సంపూను భాధపెట్టినవారెవరో తెలుసా? | Sampoornesh babu unhappy with them

Sampoornesh babu unhappy with them

Sampoornesh babu upset, Sampoornesh babu unhappy, Sampoornesh babu movies, Sampoornesh babu kobbarimatta, Sampoornesh babu records, Sampoornesh babu teaser records, Sampoornesh babu kobbari matta stills, Sampoornesh babu stills

Sampoornesh babu unhappy with them: Burning star Sampoornesh babu unhappy with NATA members. Sampoornesh babu upcoming film kobbari matta.

సంపూను భాధపెట్టినవారెవరో తెలుసా?

Posted: 05/27/2016 09:11 AM IST
Sampoornesh babu unhappy with them

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబును ఆహ్వానించి మరీ అవమానించారట. ‘హృదయకాలేయం’ సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకొని, టాలీవుడ్ లో ‘బర్నింగ్ స్టార్’గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం ఒక్క సినిమాతోనే నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. అలాంటి సంపూ ఓ విషయంపై బాధపడ్డారట.

తెలుగు ప్రేక్షకుల్లో సంపూకు వున్న క్రేజ్ ను దృష్టిలో వుంచుకొని అమెరికాలోని నాటా సంస్థ అతనిని నాటా ఉత్సవాలకు ఆహ్వానించింది. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం స్టార్ హీరోహీరోయిన్లతో పాటు సంపూను కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో సంపూ ఫోటోను కమెడియన్లతో కలిపి వేసారట. దీంతో సంపూ చాలా హర్ట్ అయ్యాడట.

హీరోగా ఎదుగుతున్న తనను కమెడియన్ గా ట్రీట్ చేయడం నచ్చలేదని, అందుకే ఈ వేడుకకు హాజరు కానని సంపూ స్పష్టం చేసాడట. అయితే నాటా సంస్థ వారు సంపూను ఎలాగోలా ఒప్పించి, మళ్లీ కొత్తగా ఆహ్వాన పత్రికలను ప్రచురించినప్పటికీ.. చివరకు తన మేనేజర్ కు వీసా రాలేదనే కారణంతో సంపూ ఈ వేడుకకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. మరి సంపూ ఈ వేడుకలో పాల్గొంటాడో లేదో మరో రెండు రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh babu  Kobbarimatta  NATA  

Other Articles