మెగా అభిమానుల కోసం మెగా సర్ ప్రైజ్ | Mega Surprise for Mega fans

Mega surprise for mega fans

Chiru, Chiranjeevi, Chiranjeevi 150th film, VV Vinayak, Chiranjeevi film, Mega Family, Mega Fans, మెగా ఫ్యాన్స్, చిరంజీవి, మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి 150వ సినిమా

Mega Star Chiranjeevi and Director VV Vinayak plan to give special treat to Mega fans. they planned to screen mega heros on Chiru 150th film.

మెగా అభిమానుల కోసం మెగా సర్ ప్రైజ్

Posted: 05/23/2016 10:25 AM IST
Mega surprise for mega fans

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా మీద అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కు సినిమా ద్వారా ఇప్పటికే ట్రీట్ ఇవ్వడానికి సిద్దమైన మెగాస్టార్ ఇప్పుడు మరో ట్రీట్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏ క్షణాల కోసం అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారో ఆ క్షణాలను తన సినిమా ద్వారా అందించడానికి చిరంజీవి సిద్దమైనట్లు తెలుస్తోంది. చిరు ఇవ్వనున్న డబుల్ ట్రీట్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఇస్తున్న డబుల్ ట్రీట్ ఏంటో తెలుసా..?

చిరంజీవి తాజాగా మొదలుపెట్టిన 150వ సినిమా అంతా షూటింగ్ కు సిద్దమైంది. రాచరణ్ స్టార్ట్ చేసిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోని క్యారెక్టర్ల కోసం ఆర్టిస్టులను వెతికే పని పూర్తైంది. కాగా ఈ సినిమాలో మెగా హీరోలను ఒకే స్క్రీన్ మీద చిరంజీవి చూపించబోతున్నాడట. ఓ సీన్ లో మెగా హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లను చూపించేందుకు వివి వినాయక్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఇదే గనక జరిగితే మెగా ఫ్యాన్స్ కు పండగే పండగ. కాగా ఈ సీన్ లో పవర్ స్టార్ కూడా ఉంటే బాగుండేది అని అందరూ అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles