కమెడియన్ ను తలపించిన మహేష్ స్టెప్పులు | Mahesh dance reminds Comedian steps

Mahesh dance reminds comedian steps

Mahesh dance reminds Comedian steps, Brahmotsavam First Review, Highlights Of Brahmotsavam, Brahmotsavam Censor Report, Brahmotsavam Songs Making, Brahmotsavam Release Date, Brahmotsavam Theaters List, Brahmotsavam Tickets, Brahmotsavam online bookings, Brahmotsavam interviews, Mahesh Babu interviews, Mahesh Babu movie, Brahmotsavam movie posters, Brahmotsavam songs, Mahesh Babu

Mahesh dance reminds Comedian steps: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer

మహేష్ స్టెప్పులకు నవ్వుకున్న జనాలు

Posted: 05/20/2016 10:34 AM IST
Mahesh dance reminds comedian steps

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్, సమంత, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించారు. పివిపి నిర్మాత.

ఈ సినిమాలో మహేష్-కాజల్ ల మధ్య వచ్చే ‘బాలత్రిపురమణి...’ సాంగ్ ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. అలాంటి ఈ పాటను వెండితెర మీద చూస్తుంటే నవ్వొచ్చేలా వుంది. ‘బాలత్రిపురమణి...’ అనే ఈ పాటలో మహేష్ చాలా యంగ్ గా వున్న మాట నిజమే. సెట్టింగ్స్, సినిమాటోగ్రఫి కూడా బాగున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

కానీ ఈ పాటలో ‘అలరే.. అలరే..’ అంటూ వచ్చే బీజియంలో మహేష్ వేసిన స్టెప్పులకు ఓ కమెడీ నటుడు గుర్తొస్తున్నాడు. గతంలో అతని తొలిసినిమాకు వేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి స్టెప్పులను మహేష్ వేస్తే ఎలా వుంటుందో... ఈ బీజియంలో వచ్చే స్టెప్పులను చూస్తే అలాంటి ఫీల్ కలుగుతోంది. దినేష్ మాస్టర్ ఈ పాటలో కొత్తగా స్టెప్పులను డిజైన్ చేయాలని అనుకొని... నవ్వుతెప్పించే విధంగా స్టెప్పులను కంపోజ్ చేసాడు.

ఇక సినిమా విషయానికొస్తే.. సినిమా అంతా కూడా స్లోగా సాగుతుండటంతో చూసే ప్రేక్షకులు చాలా బోర్ ఫీలవుతున్నారు. పూర్తిస్థాయి ఎమోషనల్ సినిమాగా ‘బ్రహ్మోత్సవం’ వున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవ్వనుందో మరికొద్ది క్షణాల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Brahmotsavam  Mahesh Babu  Review  Kajal  Samantha  

Other Articles