ఆయనకు కారు కూడా లేదంటున్న ప్రిన్స్ | Mahesh Babu talks about Srikanth Addala

Mahesh babu talks about srikanth addala

Mahesh Babu talks about Srikanth Addala, Highlights Of Brahmotsavam, Mahesh wants to do Halk role, Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Mahesh Babu talks about Srikanth Addala: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

ఆయనకు కారు కూడా లేదంటున్న ప్రిన్స్

Posted: 05/16/2016 03:47 PM IST
Mahesh babu talks about srikanth addala

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఇప్పటివరకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి. తొలి చిత్రం ‘కొత్తబంగారులోకం’ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఘన విజయం సాధించింది. దీని తర్వాత ‘ముకుంద’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇపుడు తాజాగా ‘బ్రహ్మోత్సవం’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

అలాంటి ఈ దర్శకుడికి ఇప్పటికీ సొంతంగా కారు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల గురించి మహేష్ మాట్లాడుతూ.... శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా వుంటారు. ఆయన ఎవరితో ఎక్కువగా స్నేహం చేయరు. తన పనేదో తాను చూసుకుంటాడు. చాలా స్వచ్ఛమైన మంచి మనిషి. తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక మంచి చెప్పాలనే ప్రయత్నిస్తుంటాడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అలాంటి ఆయన కారు కూడా మెయింటేన్ చేయరు. ఆయనకు కారు కూడా లేదు. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు అని చెప్పుకొచ్చాడు.

ఇక బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్, కాజల్, సమంత, ప్రణీత, రేవతి, సత్యరాజ్, జయసుధ, సాయాజీ షిండే, నరేష్ వంటి ప్రధాన తారాగణం కలిసి నటించిన ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles