తనపై తాను కామెంట్ చేసుకున్న మహేష్ | Mahesh talks about his role

Mahesh talks about his role

Mahesh talks about his role, Highlights Of Brahmotsavam, Mahesh wants to do Halk role, Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Mahesh talks about his role: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

తనపై తాను కామెంట్ చేసుకున్న మహేష్

Posted: 05/16/2016 02:41 PM IST
Mahesh talks about his role

ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పివిపి బ్యానర్ పై పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మహేష్ తో పాటుగా కాజల్, సమంతలు కూడా పాల్గొంటున్నారు. పలు మీడియా ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో మహేష్ ఈ సినిమాలో తను హీరోనే కాదంటూ కామెంట్లు చేసి, అందరికి షాక్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, సాయాజీ శిండే, నరేష్ తదితర భారీ తారాగణం నటించారు. శ్రీకాంత్ అడ్డాల రాసిన కథలో తను కూడా ఒక పాత్ర మాత్రమే పోషించానని, ఎవరి పాత్రలలో వాళ్లు చాలా చక్కగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. అందరి పాత్రలు ఇందులో కీలకమని మహేష్ చెప్పుకొచ్చాడు.

ఒక స్టార్ హీరోగా క్రేజ్ వున్న మహేష్.. తాను ఈ సినిమాలో హీరో అని చెప్పుకోకుండా కేవలం.. ఈ సినిమాలో ఓ పాత్రధారుడిగా మాత్రమే ఫీల్ అవ్వడం అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది. పూర్తిస్థాయి కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతాల ఎమోషన్స్ తో రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles