బర్త్ డే కానుకగా కాష్మోరా గిఫ్ట్ | Karthi Kashmora First Look Date

Kashmora first look date

Karthi Kashmora First Look Date, Karthi Kashmora movie updates, Karthi Kashmora film details, Karthi Kashmora stills, Karthi stills, కార్తీ, కాష్మోరా, నయనతార, శ్రీదివ్య, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, stills

Karthi Kashmora First Look Date: Tamil star hero karthi latest film Kashmora. Nayanthara, Sridivya heroines. This film first look will be released on karthi birthday special.

బర్త్ డే కానుకగా కాష్మోరా గిఫ్ట్

Posted: 05/06/2016 11:38 AM IST
Kashmora first look date

‘ఊపిరి’ సినిమాతో ఇటీవలే తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘కాష్మోరా’. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీ.. ‘కాష్మోరా’ అంటూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు.

కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలోని పూనమల్లె సమీపంలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో ‘కాష్మోరా’ చిత్ర షూటింగ్ జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కార్తీ, నయనతార, శ్రీదివ్య పాల్గొంటున్నారు.

ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కార్తీ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కార్తీ పుట్టినరోజు సంధర్భంగా ఈనెల 25న విడుదల చేయనున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Nayanthara  Sri Divya  

Other Articles