దుమ్మురేపుతున్న సూర్య అడ్వాన్స్ | Surya 24 advance booking

Surya 24 advance booking

Surya 24 movie advance booking, Surya 24 movie run time, 24 movie release date, 24 Official Trailer, 24 movie songs, సూర్య, 24 సినిమా, సమంత, నితిన్, నిత్యామీనన్, 24 movie posters, 24 movie stills, Surya 24 teaser, Surya movie stills, Surya, samantha, nithya menon

Surya 24 advance booking: Tamil Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha, Nithya menon heroines, AR Rahaman music.

దుమ్మురేపుతున్న సూర్య అడ్వాన్స్

Posted: 05/05/2016 11:46 AM IST
Surya 24 advance booking

తమిళ హీరో సూర్యకు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సూర్య నటించిన పలు చిత్రాలు తెలుగులో ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం సూర్య నటించిన ‘24’ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదలవుతుంది.

‘మనం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘24’లో సూర్య సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో రూపొందుతోంది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా రేపు(మే 6) ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దుమ్మురేపుతోంది. పలు ప్రధాన నగరాల్లో ‘24’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. మొదటి ఆటకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 44 నిమిషాలు వుందని తెలుస్తోంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  Samantha  Nithya menon  

Other Articles