వారెవ్వా.. పార్టీలో మహేష్ జోష్ | Brahmotsavam Vacchindi Kada Avakasam Song Video

Brahmotsavam vacchindi kada avakasam song video

Vacchindi Kada Avakasam Lyrical Video, Brahmotsavam Motion Poster, Brahmotsavam Audio Release Date, మహేష్ బాబు, బ్రహ్మోత్సవం, కాజల్, ప్రణీత, సమంత, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Brahmotsavam Vacchindi Kada Avakasam Song Video: Mahesh Babu, Samantha, Kajal Aggarwal and Pranitha Subhash. Brahmotsavam Telugu movie is directed by Srikanth Addala and music composed by Mickey J Meyer. Produced by Prasad V Potluri under the banner PVP.

వారెవ్వా.. పార్టీలో మహేష్ జోష్

Posted: 05/04/2016 11:22 AM IST
Brahmotsavam vacchindi kada avakasam song video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సందడి మొదలయ్యింది. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 7వ తేదిన గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. ఇందులోని ‘వచ్చింది కదా అవకాశం..’ అనే పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేసారు.

ఈ పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ పాటను 91,828 మంది వీక్షించారు. పూర్తిస్థాయి పార్టీ తరహాలో, కుటుంబ సభ్యులతో కలిసి పాడుకునే విధంగా వుంది. వెస్ట్రన్ తరహాలో పూర్తి సందడిగా కొనసాగుతుంది. ఈ పాట విజువల్స్ పరంగా మరింత బాగుండే అవకాశం వుంది. విజువల్స్ పరంగా మహేష్ మ్యాజిక్ చేయగలడనిపిస్తోంది. పాటలో వచ్చే స్టిల్స్ చూస్తుంటే మరింత అంచనాలు పెరుగుతున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్ పై నిర్మాత పరల్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. మహేష్ సరసన కాజల్, ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Samantha  Kajal  Praneetha  

Other Articles