సూర్య ‘24’ రన్ టైం ఫిక్స్ | 24 movie run time

24 movie run time

Surya 24 movie run time, 24 movie release date, 24 Official Trailer, 24 movie songs, సూర్య, 24 సినిమా, సమంత, నితిన్, నిత్యామీనన్, 24 movie posters, 24 movie stills, Surya 24 teaser, Surya movie stills, Surya, samantha, nithya menon

24 movie run time: Tamil Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha, Nithya menon heroines, AR Rahaman music.

సూర్య ‘24’ రన్ టైం ఫిక్స్

Posted: 05/04/2016 09:44 AM IST
24 movie run time

‘మనం’ సినిమా తర్వాత దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘24’. సూర్య, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో రూపొందుతోంది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మే 6వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ లో దాదాపు 225 స్ర్కీన్లలో ప్రదర్శించనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 44 నిమిషాలు వుందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశం కావడం వల్ల నిడివి కాస్త ఎక్కువగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య, నిత్యామీనన్, సమంతల నటన హైలెట్ గా నిలవనున్నాయి. సూర్య పలు విభిన్న పాత్రలలో నటించిన ఇరగదీసాడని సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  Samantha  Nithya menon  

Other Articles