చిరు సినిమాకు షాకిచ్చిన ‘రైటర్’ | that Writer shocks Chiru 150th FIlm

That writer shocks chiru 150th film

Mega Star, Chiranjeevi, Chiru, Chiranjeevi 150th Film, VV Vinayak, Kaththi, Kathilantodu, RamCharan, చిరంజీవి, చిరు, వివి వినాయక్, రాంచరణ్

Mage Star Chiranjeevi got shock from a writer. Earlied VV Vinayak setteled matter with that writer but now he is not listening anybody.

చిరు సినిమాకు షాకిచ్చిన ‘రైటర్’

Posted: 04/30/2016 04:27 PM IST
That writer shocks chiru 150th film

చిరంజీవి సినిమా మొత్తానికి అన్ని అరిష్టాలను దాటి సెట్స్ మీదకు వెళుతుంది అని అనుకున్న టైంలోనే మెగా ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి 150వ సినిమా జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుంది అనుకుంటున్న టైంలో ఓ వ్యక్తి  అందరికి షాకిచ్చారని తెలుస్తోంది. రాంచరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి రెమ్యునరేషన్ విషయంలో కాస్త బెట్టుచేశారని.. కానీ ఇప్పుడు రెమ్యునరేన్ కాకుండా వేరే అంశంలో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది.

గతంలోనే ఈ స్టోరీ తనదే అంటూ ఓ రచయిత వివాదం రేపడంతో చిరంజీవి ఈ సినిమా మీద ఓ టైంలో ఆశలు వదులుకున్నారని తెలిసింది. అప్పుడు వివి వినాయక్ కల్పించుకొని ఆ వ్యక్తితో కొంత మొత్తానికి సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు సైలెంట్ అయిన ఆ వ్యక్తి ఇప్పుడు మాత్రం మరోసారి వివాదాన్ని తెర మీదకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎం.నరసింహారావు అనే వ్యక్తి ఇప్పుడు తనకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా పర్లేదని కానీ స్క్రీన్ పై మాత్రం తన పేరు కనిపించాలని పట్టుబడుతున్నాడట. మరి దీనిని మెగా స్టార్, వివి వినాయక్ ఎలా సెటిల్ చేసుకుంటారో చూడాలి.




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles