Heroine for Chiru 150th film

Heroine for chiru 150th film

Chiranjeevi, Chiru, RamCharan, Chiru 150th FIlm, Chiranjeevi 150th Film, RamCharan for Chiru Cinema, చిరంజీవి, రాంచరణ్, చిరంజీవి హీరోయిన్

May RamCharan conformed Chiranjeevis 150 film Heroine. In the Konedala Production Company, Chirus 150th film will go sets soon.

చిరంజీవి సినిమాకు ఆ హీరోయిన్..? ఓకే చేసిన చరణ్..?

Posted: 04/30/2016 10:04 AM IST
Heroine for chiru 150th film

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా నిన్న లాంఛనంగా పూజాకార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమానికి హజరైంది. వివి వినాయక్ దర్శకత్వంలో తమిళ్ లో సూపర్ హిట్ సినిమా కత్తిని తెలుగులో మెగా స్టార్ తో రీమేక్ చేయిస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలొ చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు అన్నదాని మీద ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా చరణ్ ఓ హీరోయిన్ ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో రాంచరణ్ తో కలిసి నటించిన హీరోయిన్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోనున్నట్లు సమాచారం. చిరంజీవితో పాటు స్టెప్పులెయగల, సత్తా ఉన్న హీరోయిన్ గా తమన్నా బాగా సూట్ అవుతుందని రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles