ఏడాదికి 30 కథలు విన్నా నచ్చలేవట | Allu Sirish New Movie Launched

Allu sirish new movie launched

Allu Sirish New Film Launched, Allu Sirish upcoming films, Allu Sirish movie updates, Allu Sirish stills, Allu Sirish movies, Allu Sirish movie news, Allu Sirish latest stills

Allu Sirish New Movie Launched: Allu Sirish latest film Srirastu Subhamastu. Lavanya tripati heroine. parasuram Direction. Allu Sirish Next Film under upcoming director Venu.

ఏడాదికి 30 కథలు విన్నా నచ్చలేవట

Posted: 04/28/2016 03:42 PM IST
Allu sirish new movie launched

అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించనున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటిశ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.... శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. డైరెక్టర్ ఎం.వి.ఎన్. తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో బన్ని అనే సినిమాను కూడా నిర్మించారు. అలాగే నాకు డైరెక్టర్ తో చిన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్ చూస్తున్నారు. డైలాగ్ వెర్షన్ వర్క్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 20-30 కథలు వింటుంటాను. కానీ ఈ కథను సింగిల్ సిటింగ్ లోనే ఓకే చేసేశాను. నాన్నగారు కూడా కథను సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశారు. లవ్ ఎంటర్ టైనర్, 700 సంవత్సరాల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స ఉండే చిత్రం. ఈ సినిమా కోసం వర్కవుట్ చేయాలి. శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఈ సినిమా సెట్స్ లోకి వెళుతుంది. ఇలాంటి రోల్ చేయాలని ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను. కామెడి, పెర్ ఫార్మెన్స్ కలగలిసిన క్యారెక్టర్ అని అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: జిబ్రాన్, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: ఎం.వి.ఎన్.రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Sirish  Lavanya Tripati  Srirastu Subhamastu  

Other Articles