ఇదేం ‘ఫోబియా’ రాధికా? | Phobia Movie Trailer

Phobia movie trailer

Radhika Apte Phobia Trailer, Phobia teaser, Radhika Apte latest updates, Radhika Apte hot stills, Radhika Apte stills, Radhika Apte gossips, Phobia movie updates, Phobia movie stills, Phobia movie posters

Phobia Movie Trailer: Radhika Apte, Satyadeep Mishra, Ankur Vikal, Yashaswani Dayama & Nivideta Bhattercharya acts in lead roles. Directed By: Pavan Kirpalani. Produced By: Viki Rajani.

ఇదేం ‘ఫోబియా’ రాధికా?

Posted: 04/28/2016 08:51 AM IST
Phobia movie trailer

నందమూరి బాలకృష్ణతో ‘లెజెండ్’ ‘లయన్’ సినిమాలలో జతకట్టిన రాధిక ఆప్టే ప్రస్తుతం హిందీలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫోబియా’. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను మరింతలా పెంచేస్తోంది.

ఇందులో మెహతక్ అనే ఒక ఆర్టిస్ట్ పాత్రను రాధిక పోషిస్తోంది. ఒక యాక్సిడెంట్ కు గురైన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కతోంది. థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ పాత్రలో నటించేముందు కొంతమంది సైకియాట్రిస్ట్ లను సంప్రదించడమే కాకుండా, అలాగే తన పాత్ర ప్రవర్తించే తీరును గమనించడం కోసం కొంతమంది రోగుల బిహేవియర్ ను రాధిక పరిశీలించిందట.

రాధిక ఆప్టే, సత్యదీప్ మిశ్రా, అంకూర్ వికల్, యశస్విని దయామా, నివేదిత భట్టాచార్య తదితరులు ప్రధాన తారగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ కిర్ పలానీ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కి రజనీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Phobia  Trailer  

Other Articles