ఆడియో సన్నాహాల్లో ‘జెంటిల్ మన్’ | Nani Gentleman Shooting Completed

Nani gentleman shooting completed

Nani Gentleman Audio Launch Details, Nani Gentleman first look, Nani Gentleman posters, Nani Gentleman movie updates, Nani Gentleman movie news, Nani, Gentleman

Nani Gentleman Shooting Completed: Tollywood actor Nani latest film Gentleman. This Movie First Look poster released on Sri Rama Navami special. Mohanakrishna Indraganti director. Manisharma music.

ఆడియో సన్నాహాల్లో ‘జెంటిల్ మన్’

Posted: 04/28/2016 08:02 AM IST
Nani gentleman shooting completed

‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడివీరప్రేమగాథ’ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెంటిల్ మన్’. ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, నానిల కాంబినేషన్లో ‘అష్టాచమ్మా’ అనే హిట్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిదే.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాని సరసన సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో నాని క్యారెక్టర్ ఎలా వుండబోతుందోననే ఆసక్తి నెలకొంది.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మిగతా వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Gentleman  Surabhi  

Other Articles