యాంకర్ పై దర్శకుడి భార్య కేసు | Case filed on telugu tv serial actress

Case filed on actress geetha bhagat

geetha bhagat case, case on geetha bhagat, geetha bhagat latest stills, geetha bhagat hot stills, geetha bhagat movie, geetha bhagat husband madhukar, geetha bhagat family problems, geetha bhagat

Case filed on Actress Geetha Bhagat: Telugu tv anchor, serial actress geetha bhagat latest news, updates, family, case, issues, stills, gallery.

యాంకర్ పై దర్శకుడి భార్య కేసు

Posted: 04/27/2016 11:16 AM IST
Case filed on actress geetha bhagat

టీవి సీరియల్ దర్శకుడు, నటి సంసారం గొడవలు కాస్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ప్రముఖ టీవి సీరియల్ దర్శకుడు మధుకర్ మొదటి భార్య తనకు అన్యాయం జరిగిందని, తన సంసారం కూలిపోయిందంటూ మానవ హక్కుల కమీషన్ ను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

టీవి యాంకర్, సీరియల్ నటి గీత భగత్ తన భర్తను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తోందని మధుకర్ మొదటి భార్య రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేసింది. ఇందుకు స్పందించిన కమీషన్.. జూన్ 13వ తేదిలోగా విచారణ చేపట్టి ఓ నివేదిక అందజేయాలని బాలానగర్ ఏసిపికి ఆదేశాలు జారీ చేసింది.

మోతీనగర్ ప్రాంతానికి చెందిన జి. సీత(న్యాయవాది) ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తనకు టీవి సీరియల్ డైరెక్టర్ మధుకర్ తో 2002లో వివాహం జరిగిందని, తమకు ఇద్దరు సంతానం వున్నారని తెలిపింది. అయితే తన భర్త విడాకులు ఇవ్వకుండానే నటి గీతా భగత్ ను రెండో వివాహం చేసుకున్నాడని, అప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.

తాము వుంటున్న ఇంటిని తన భర్త తన కుమారుని పేరుపై గిఫ్టెడ్ రాశాడని అయితే ఇటీవలే గీతా భగత్ ఆ ఇల్లు తన పేరు మీద వుందని, రాత్రి వేళల్లో గేటుకు తాళం వేసి తమను ఇబ్బందులను గురిచేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని, తనను వేధింపులకు గురి చేస్తున్న భర్త మధుకర్, గీతా భగత్ మరియు ఆమె తల్లిపై చర్చలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. మరి ఏం జరుగనుందో చూడాలి.

Source: Filmybeat

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor  geetha bhagat  Hot stills  

Other Articles